Naresh-Pavitra: నరేష్.. పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ క్రేజీ అప్డేట్.. టీజర్ వచ్చేస్తోందట..
ఆ వివాహం నిజ జీవితానికి సంబంధించినది కాదని.. ఓ సినిమా కోసం అలా వీడియో చేశారని తర్వాత తెలిసిందే. ఆ సినిమా పేరే మళ్లీ పెళ్లి. మెగా మూవీ మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. కన్నడ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సీనియర్ నటుడు వీకే నరేష్.. పవిత్ర లోకేష్ ప్రేమాయణం గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు రాగా.. తమ ప్రేమను వ్యక్తంచేస్తూ.. త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నామంటూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇటీవల తమ పెళ్లి జరిగిపోయిందంటూ ఓ వీడియో షేర్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో చూసి కొందరు శుభాకాంక్షలు చెప్పగా.. మరికొందరు ఏదో సినిమాలగా ఉందంటూ కామెంట్స్ చేశారు. అయితే ఆ వివాహం నిజ జీవితానికి సంబంధించినది కాదని.. ఓ సినిమా కోసం అలా వీడియో చేశారని తర్వాత తెలిసిందే. ఆ సినిమా పేరే మళ్లీ పెళ్లి. మెగా మూవీ మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. కన్నడ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
పెద్ద వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 13న రిలీజ్ చేయనున్నట్లు నరేష్ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా మళ్లీ పెళ్లి అది .. ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆయన తెలిపారు.
ఇందులో జయసుధ, శరత్ బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.