Ravanasura First Day Collections: ‘రావణాసుర’ ఫస్ట్ డే కలెక్షన్స్ !.. మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే..

ఇందులో జయరాం, రావు రమేష్, భరత్ రెడ్డి, శ్రీరామ్, సంపత్ కీలకపాత్రలలో నటించారు. ఏప్రిల్ 7న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ కెరియర్ లో డిఫరెంట్ సబ్జెక్ట్‏తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. హై వోల్టేజ్ యాక్షన్ కమర్షియల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‏తో ఈ మూవీని ప్రేక్షకులకు అందించారు.

Ravanasura First Day Collections: 'రావణాసుర' ఫస్ట్ డే కలెక్షన్స్ !.. మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే..
Ravanasura
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 08, 2023 | 3:49 PM

గతేడాది ధమాకా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మాస్ మాహరాజా రవితేజ. ఇక అదే జోష్‏తో నిన్న రావణాసుర సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈహీరో. ఎప్పుడు హీరోగానే కాకుండా.. ఈ సినిమా పవర్ ఫుల్ విలనిజం చూపించారు మాస్ మహరాజా. అభిషేక్ పిక్చర్స్.. ఆర్టీటీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా.. రవితేజ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇందులో జయరాం, రావు రమేష్, భరత్ రెడ్డి, శ్రీరామ్, సంపత్ కీలకపాత్రలలో నటించారు. ఏప్రిల్ 7న విడుదలైన రావణాసుర పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ కెరియర్ లో డిఫరెంట్ సబ్జెక్ట్‏తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. హై వోల్టేజ్ యాక్షన్ కమర్షియల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‏తో ఈ మూవీని ప్రేక్షకులకు అందించారు.

ఈ క్రమంలోనే రావణాసుర ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. నైజాంలో రూ. 1.64 కోట్లు రాబట్టగా.. సీడెడ్ లో రూ. 70 లక్షలు.. యూఏలో.. రూ. 61 లక్షలు.. తూర్పు గోదావరి.. రూ. 30 లక్షలు.. పశ్చిమ గోదావరి రూ. 21 లక్షలు.. గుంటూరు రూ. 45 లక్షలు.. కృష్ణ.. రూ. 23 లక్షలు.. నెల్లూరు రూ. 15 లక్షలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 4.29 కోట్లు వసూలు చేయగా.. 6.70 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 0.26 కోట్లు కాగా.. ఓవర్సీస్ రూ. 0.30 కోట్లు రాబట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్ రూ. 4.85 కోట్లు కలెక్షన్స్.. రూ. 7.85 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీపై ఏకంగారూ. 22.20 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక 23 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి రోజు 4.85 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా క్లీన్ హిట్ కావాలంటే.. 18.15 కోట్ల షేర్ రాబట్టాలి. ఇక ఈ వీకెండ్ రెండు రోజులు కలెక్షన్స్ భాగానే వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.