Sai Pallavi : ‘ఓం నమః శివాయా’.. అమర్‌నాథ్ యాత్రలో సాయి పల్లవి.. అమ్మానాన్నలతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర
ప్రముఖ నటి సాయి పల్లవి పరమ పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రలో పాల్గొంది. ఇటీవల తల్లిదండ్రులతో కలిసి ఈ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చిన ఆమె అక్కడి ఫొటోలు, అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమర్‌నాథ్‌యాత్ర తన సంకల్ప బలాన్ని సవాలు చేసిందని, మానసికంగా పలు పరీక్షలు పెట్టిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్టును షేర్ చేసింది సాయి పల్లవి

ప్రముఖ నటి సాయి పల్లవి పరమ పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రలో పాల్గొంది. ఇటీవల తల్లిదండ్రులతో కలిసి ఈ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చిన ఆమె అక్కడి ఫొటోలు, అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమర్‌నాథ్‌యాత్ర తన సంకల్ప బలాన్ని సవాలు చేసిందని, మానసికంగా పలు పరీక్షలు పెట్టిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్టును షేర్ చేసింది సాయి పల్లవి. ‘నా పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి నాకు పెద్దగా ఆసక్తి లేదు. అయితే అమర్‌నాథ్ ఆధ్యాత్మిక యాత్ర గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్లాలని ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్నాను. మొత్తానికి నా కల నిజమైంది. అయితే 60 ఏళ్ల అమ్మానాన్నలను ఈ యాత్రకు తీసుకెళ్లడం ఎన్నో చాలా సవాలుగా అనిపించింది. కొన్నిసార్లు వాళ్లు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఆయాసపడుతూ ఛాతీ పట్టుకోవడం.. యాత్ర మధ్యలో అలసిపోవడం వంటి పరిస్థితులను చూసి ‘ దేవుడా.. మీరు ఎందుకు ఇంత దూరంలో ఉన్నారు’ అని అడిగేలా చేశాయి. అయితే స్వామి వారి దర్శనం అనంతరం ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. కొండ దిగి కిందకు వచ్చేటప్పుడు మనసును హత్తుకునే దృశ్యాలను చూశాను’ అని సాయి పల్లవి తెలిపింది.
‘యాత్ర మధ్యలో పలువురు భక్తులు ఇబ్బందిపడుతూ ఉండగా.. వాళ్లలో మనో ధైర్యాన్ని నింపడం కోసం చుట్టుపక్కన ఉన్న యాత్రికులందరూ ‘ఓం నమః శివాయా’ అంటూ గట్టిగా స్మరించారు. దీంతో ఇక వెళ్లలేం అనుకున్న యాత్రికులు కూడా ఒక్కసారిగా దేవుడిని తలచుకుని ముందుకు ధైర్యంగా అడుగులు వేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో మాలాంటి లక్షలాది మందికి అడగడుగునా సహాయ సహకారాలు అందజేసిన అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డులోని ప్రతి ఒక్కరికీ, ఆర్మీ, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు. ఈ ఆధ్యాత్మిక యాత్ర నా సంకల్ప శక్తిని సవాలు చేసింది. అలాగే నా మనోధైర్యాన్ని పరీక్షించింది. మనిషిగా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయకపోతే మనం కూడా చనిపోయిన వాళ్లతో సమానమే అని ఈ తీర్థయాత్ర తెలియజేసింది’ అని తన ఆధ్యాత్మిక యాత్ర విశేషాలను పంచుకుంది సాయి పల్లవి.




View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.




