Baby 1st Day Collections: ‘బేబీ’ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే..
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు నిరాశపరిచినప్పటికీ.. ఇటీవల విడుదలైన సామజవరగమన చిత్రం పర్వాలేదనిపించుకుంది. ఇక ఇప్పుడు బేబీ సినిమా ఇండస్ట్రీకి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఓవైపు ఈ సినిమాపై ట్రోల్స్ జరుగుతున్నప్పటికీ మరోవైపు సక్సెస్ ఫుల్ టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ యువత మనసులను తాకుతుంది.

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బేబీ. ఇందులో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలకపాత్రలు పోషించగా.. డైరెక్టర్ సాయి దర్శకత్వం వహించారు. జూలై 14న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. గత కొన్ని వారాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు నిరాశపరిచినప్పటికీ.. ఇటీవల విడుదలైన సామజవరగమన చిత్రం పర్వాలేదనిపించుకుంది. ఇక ఇప్పుడు బేబీ సినిమా ఇండస్ట్రీకి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఓవైపు ఈ సినిమాపై ట్రోల్స్ జరుగుతున్నప్పటికీ మరోవైపు సక్సెస్ ఫుల్ టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ యువత మనసులను తాకుతుంది. ముందుగా బేబీ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత మొదటి రోజు నుంచి ఏరియాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో శుభారంభం ఇచ్చింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉంటే.. ఫస్ట్ డే కలెక్షన్స్ కాస్త ఎక్కువగానే వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.7.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా కనిపించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఇక ఫస్ట్ డే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది.




ఇక ఆనంద్ దేవరకొండ కెరియర్లో ఈ సినిమా స్పెషల్ కానుందని తెలుస్తోంది. అలాగే కథానాయికగా వైష్ణవికి ఫస్ట్ మూవీ మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు రూ.4కోట్లు పైగానే గ్రాస్ వచ్చాయి. ఓవర్సీస్ లో దాదాపు రూ.80 లక్షలకు పైగా షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటివరకు రూ.7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఈ వీకెండ్ శనివారం, ఆదివారం రెండు రోజులు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ముందని తెలుస్తోంది.




