Keerthi Suresh,Sai Pallavi : దసరాలో వెన్నెల పాత్ర కీర్తి సురేష్ కాకుండా సాయి పల్లవి చేసుంటే..
మొన్నటి వరకు లవర్ బాయ్ గా అలరించిన నాని దసరా సినిమాతో మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి మంచి హిట్ గానే కాకుండా కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది.
రీసెట్ గా నేచురల్ స్టార్ ననియు దసరా సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. నాని ఈ సినిమాతో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. మొన్నటి వరకు లవర్ బాయ్ గా అలరించిన నాని దసరా సినిమాతో మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి మంచి హిట్ గానే కాకుండా కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఈ సినిమా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. నాని ధరణి పాత్రలో నటించగా.. కీర్తి వెన్నెల పాత్రలో మెప్పించింది. ఈ సినిమాలో డీ గ్లామర్ లుక్ లో కనిపించిన ఈ చిన్నది మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో కీర్తి డాన్స్ తోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా పెళ్లి బారాత్ లో కీర్తి చేసిన డాన్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. వెన్నెల పాత్రలో కీర్తిని తప్ప మరో హీరోయిన్ ను ఉంచుకోలేం.. అయితే కొంతమంది కీర్తితో పాటు ఆ పాత్రకు సాయి పల్లవి కూడా న్యాయం చేస్తుందని అంటున్నారు. సాయి పల్లవి కూడా నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేయగలదు.
పైగా తెలంగాణ యాస చాలా బాగా మాట్లాడుతుంది. డాన్స్ లోనూ అదరగొడుతుంది. వెన్నెల పాత్ర సాయి పల్లవి చేసి ఉండుంటే ఇంకా బాగుండేది అని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ ఇద్దరు భామలు వెన్నెల పాత్రకు సరిగ్గా సరిపోతారు. ఈ ఇద్దరు భామలు తమ సహజ నటనతో తెలుగు ప్రేక్షాకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం కీర్తి వరుస సినిమాలను లైనప్ చేస్తుంటే.. సాయి పల్లవి మాత్రం సైలెంట్ అయ్యింది గత కొంతకాలంగా ఆమె కొత్త సినిమా అప్డేట్స్ రావడం లేదు. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.