Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara 2: గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్‌లో హీరో రిషబ్‌ శెట్టి.. కాంతారా 2 కోసమేనా?

కాంతారా’ సినిమా ప్రీక్వెల్‌ను రిషబ్ శెట్టి రాశాడని, షూటింగ్ కూడా ప్రారంభమైందని అంటున్నారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నాడని సమాచారం. రిషబ్ శెట్టి చాలా సీక్రెట్‌గా 'కాంతారా 2' షూటింగ్ చేస్తున్నాడని అంటున్నారు. సినిమా కథకు సంబంధించిన సీక్రెట్‌ను బయటపెట్టకుండా ..

Kantara 2: గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్‌లో హీరో రిషబ్‌ శెట్టి.. కాంతారా 2 కోసమేనా?
Kantara 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 14, 2023 | 10:15 PM

‘కాంతారా ‘ సినిమా రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. ఈ సినిమా రిషబ్ శెట్టికి విపరీతమైన పాపులారిటీని, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ‘కాంతారా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దీని ఫ్రీక్వెల్‌ లేదా సీక్వెల్‌పైనే ఉంది. ‘కాంతారా’ సినిమా ప్రీక్వెల్‌ను రిషబ్ శెట్టి రాశాడని, షూటింగ్ కూడా ప్రారంభమైందని అంటున్నారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నాడని సమాచారం. రిషబ్ శెట్టి చాలా సీక్రెట్‌గా ‘కాంతారా 2’ షూటింగ్ చేస్తున్నాడని అంటున్నారు. సినిమా కథకు సంబంధించిన సీక్రెట్‌ను బయటపెట్టకుండా తెరకెక్కిస్తున్నాడు రిషబ్. అయితే ఇప్పుడు రిషబ్ కొత్త లుక్ రివీల్ కావడంతో ఈ లుక్ ‘కాంతారా 2’ కోసం గడ్డం పెంచాడంటున్నారు. . ‘కాంతారా’తో పాటు పలు సినిమాల్లో సన్నగా గడ్డం పెంచుకున్న రిషబ్ శెట్టి.. ఇప్పుడు ఋషుల స్టైల్‌లో పొడవాటి గడ్డం పెంచాడు. రిషబ్ లుక్ ‘కాంతారా 2’ సినిమాలోనిదేనని అంటున్నారు.

రీసెంట్ గా రిషబ్ శెట్టి, అజనీష్ లోక్ నాథ్, సింగర్ విజయ్ ప్రకాష్ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ తో ‘కాంతారా’ సినిమా గురించి వీడియో కాల్ చేశారు. అజనీష్ లోక్‌నాథ్ వీడియో కాల్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సినిమాలో రిషబ్ కొత్త లుక్ రివీల్ అయింది. పొడవాటి గడ్డం పెంచిన రిషబ్ శెట్టి కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ‘కాంతారా 2’ సినిమా కథ ‘కాంతారా’ కంటే ముందు కాలంలోనే జరగనుంది. కాబట్టి దీనిని ప్రీక్వెల్ అంటారు. ‘కాంతారా 2’ సినిమాలో మొదటి భాగం కంటే రాజుల కాలం నాటి కథ కాస్త ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. అంతేకాదు అడవికి పారిపోయి కనిపించకుండా పోయిన రిషబ్ (కడుబెట్టు శివ) తండ్రి కథ ‘కాంతారా’లో ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని కూడా హోంబాలే ఫిలింస్ నిర్మిస్తోంది. ‘కాంతారా’ చిత్రానికి పనిచేసిన చాలా మంది టెక్నీషియన్లు ‘కాంతారా 2’ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దీపావళి వేడుకల్లో రిషబ్ శెట్టి..

సైమా అవార్డుల్లో కాంతారా హీరో..

View this post on Instagram

A post shared by SIIMA (@siimawards)

కాగా  కాంతార రిలీజ్‌ను పురస్కరించుకుని కొన్ని రోజుల క్రితం నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాలో బాగా పాపులర్‌ అయిన ‘వరాహ రూపం’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. కాంతారా చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.