Tollywood: మీ మెదడుకు పెద్ద పరీక్షే.. ఈ హీరోను గుర్తుపట్టారా ?.. అచ్చం తాతలాగే..
ఫోటోను చూశారు కదా.. అమెజాన్ ప్రైమ్ పేపర్ చదువుతున్న ఆ హీరో ఎవరో గుర్తుపట్టగలరా ?.. టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో ఒకరు. అంతేకాదు.. అగ్రకథానాయకుడి తనయుడు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందమైన ప్రేమకథ చిత్రంతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు మరోసారి తన హిట్ పెయిర్‌తో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. గుర్తుపట్టారా ?..

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్ తెగ సందడి చేస్తుంటాయి. మొన్నటివరకు సెలబ్రెటీస్ త్రోబ్యాక్ పిక్చర్స్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే హీరోయిన్స్ రేర్ ఫోటోస్ గుర్తుపట్టడము కష్టమే. ఇప్పుడు అలాంటీ ఛాలెంజ్ మీకు ఇస్తుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్. పైన ఫోటోను చూశారు కదా.. అమెజాన్ ప్రైమ్ పేపర్ చదువుతున్న ఆ హీరో ఎవరో గుర్తుపట్టగలరా ?.. టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో ఒకరు. అంతేకాదు.. అగ్రకథానాయకుడి తనయుడు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందమైన ప్రేమకథ చిత్రంతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు మరోసారి తన హిట్ పెయిర్‌తో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. గుర్తుపట్టారా ?.. ఆ హీరో ఎవరంటే.. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. త్వరలోనే ధూత వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్లాట్ ఫాంపై సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ చైతూ క్రేజీ ఫోటోను షేర్ చేస్తూ ధూత వెబ్ సిరీస్ అప్డేట్ ఇచ్చింది.
నిజానికి ధూత వెబ్ సిరీస్ ఎప్పుడో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ అనుహ్య కారణాలతో చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫాంపైకి రానుంది. ధూత వెబ్ సిరీస్ అప్డేట్ బుధవారం (నవంబర్ 15న) మధ్యాహ్నం రాబోతుందంటూ మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ సిరీస్ ను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ దాస్యం కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్ కోసం అడియన్స్ చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
guess who hides behind to let the mystery unfold… pic.twitter.com/XK1qhej4Av
— prime video IN (@PrimeVideoIN) November 14, 2023
ఇదిలా ఉంటే.. చైతూ చివరిసారిగా కస్టడీ చిత్రంలో కనిపించారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ కాప్ యాక్షన్ డ్రామాలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం చైతూ చందూ మొండేటీ దర్శకత్వంలో తన 23వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇప్పుటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేశాడు చైతూ. ఇందులో మరోసారి చైతన్య సరసన సాయి పల్లవి నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.