Rashmika Mandanna: మేనేజర్ చేతిలో మోసపోయిన రష్మిక మందన్నా ?.. ఎన్ని లక్షలు దొచేశాడంటే..
ఇటీవల అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం యానిమల్ చిత్రీకరణలో బిజీగా ఉంది రష్మిక. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రష్మికకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది రష్మిక మందన్నా. కిరిక్ పార్టీ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలోనే అగ్రకథాయికగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో గీతా గోవిందం మూవీతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ టర్న్ అయ్యింది. ఈ మూవీ తర్వాత తెలుగులో రష్మికకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక ఇటీవల అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం యానిమల్ చిత్రీకరణలో బిజీగా ఉంది రష్మిక. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రష్మికకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.
రష్మికను ఆమె మేనేజర్ మోసం చేసినట్లుగా తెలుస్తోంది. ఆమెకు తెలియకుండా దాదాపు రూ.80 లక్షలను దొంగిలించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన రష్మిక వెంటనే.. ఆ మేనేజర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అతను చాలా కాలంగా రష్మిక వద్ద పనిచేస్తున్నాడని.. వీరిద్దరి మధ్య మంచి సన్నిహిత అనుబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై రష్మిక ఇప్పటికీ మౌనంగానే ఉంది.




ప్రస్తుతం రష్మిక.. యానిమల్ సినిమానే కాకుండా పుష్ప 2లోనూ నటిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇందులో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇవే కాకుండా తెలుగులో రష్మిక లేడీ ఓరియెంటెడ్ చిత్రంలోనూ నటిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



