AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: మరో క్రేజీ ప్రాజెక్టులో రష్మిక మందన్న.. ఈసారి ఆ పాన్‌ ఇండియా హీరోలతో కలిసి..

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్నా. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తుంది. మరోవైపు కోలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో రష్మిక మందన్నకు కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని చర్చలు పూర్తయ్యాయని...

Rashmika Mandanna: మరో క్రేజీ ప్రాజెక్టులో రష్మిక మందన్న.. ఈసారి ఆ పాన్‌ ఇండియా హీరోలతో కలిసి..
Rashmika Mandanna
Basha Shek
|

Updated on: Aug 07, 2023 | 7:30 AM

Share

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్నా. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తుంది. మరోవైపు కోలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో రష్మిక మందన్నకు తమిళ స్టార్ నటుడి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అన్ని చర్చలు పూర్తయ్యాయని, మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. కోలీవుడ్‌ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ కొత్త సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా నటించనున్నారు. తాజా సూపర్ హిట్ మలయాళ చిత్రం ‘2018’కి దర్శకత్వం వహించిన జూడ్ ఆంటోని జోసెఫ్ ఈ మల్టీ స్టారర్‌ మూవీలో దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ లైకా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. చియాన్ విక్రమ్, రష్మిక, విజయ్‌లతో నిర్మాణ సంస్థ చర్చలు జరిపిందని, వారు కూడా సినిమాకు ఓకే చెప్పారని తెఉలస్తోంది. విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే దీని గురించి కచ్చితమైన సమాచారం రావాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ చిత్రం గురించి లైకా ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించనుంది. కాగా జూడ్ ఆంటోని దర్శకత్వం వహించిన 2018 ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ బడ్జెట్‌తో హై క్వాలిటీ సినిమా తీసినఈ మూవీపై ప్రశంసల వర్షం కురిసింది. మలయాళంలో ఇప్పటివరకు ‘2018’ సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ‘పులిమురుగన్’ సినిమా కలెక్షన్ల రికార్డును ‘2018’ బ్రేక్ చేసి వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. మంచి నటుడు కూడా అయిన జూడ్ ఆంటోని ‘ప్రేమమ్’తో పాటు పలు మలయాళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు.

ప్రస్తుతం చియాన్ విక్రమ్ తంగళాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే పోస్టర్స్‌, టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా ఓ తెలుగు సినిమాలో విక్రమ్ విలన్ గా నటిస్తాడని అంటున్నారు. చియాన్ నటించిన ‘ధృవ నక్షత్రం’ త్వరలో విడుదల కానుంది. ఇక నటి రష్మిక రణబీర్ కపూర్‌తో కలిసి ‘యానిమల్’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ పూర్తైనట్లు సమాచారం. అలాగే టైగర్ ష్రాఫ్‌తో కలిసి మరో సినిమాలో నటించనుంది నేషనల్‌ క్రష్‌. తెలుగులో ‘పుష్ప 2’ సినిమాలో కూడా నటిస్తోంది. తమిళంలో కూడా ఓ సినిమా అంగీకరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం