Dhurandhar 2 Collections: బాక్సాఫీస్ కా షేర్.. ఆరు రోజుల్లోనే దిమ్మతిరిగే కలెక్షన్స్.. ధురంధర్ 2 దెబ్బకు థియేటర్లు షేక్..
సాధారణంగా భారతీయ సినిమ ప్రపంచంలో సీక్వెల్స్ కు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఇదివరకు చాలా సినిమాల సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ రికార్డులు కొల్లగొట్టాయి. ప్రస్తుతం రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమా సైతం థియేటర్లలో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ మూవీ కలెక్షన్స్ చూసి విమర్శకులే ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా ధురంధర్ 2 ది రివెంజ్. గతేడాది విడుదలైన ధురంధర్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ రెండు చిత్రాలు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కేవలం ఐదు రోజుల్లోనే అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సీక్వెల్ ఒరిజినల్ చిత్రాన్ని అధిగమించడమే కాకుండా థియేటర్లలో భారీ తేడాతో వసూల్లు రాబడుతుంది. ఈ ఏడాది అత్యధిక వసూల్లు సాధించిన చిత్రంగా ధురంధర్ 2 నిలిచింది. కేవలం ఆరు రోజుల్లోనే భారతదేశంలో రూ.687 కోట్లకు పైగా… ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఇక ఈరోజుతో ఈ మూవీ రూ.1000 కోట్ల క్లబ్ లోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక లెక్కలు చూస్తే.. ఈ ఫ్రాంచైజీ చిత్రం ఇప్పటికే రూ. 2000 కోట్లు వసూలు చేసింది. ఈ మైలురాయిని సాధించిన ఏకైక భారతీయ దర్శకుడిగా ఆదిత్య ధర్ నిలిచాడు.
ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..
అయితే ఈ సినిమా లెక్కలను చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ రెండు భాగాలుగా వచ్చిన ధురంధర్ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీని సుమారు రూ.300 కోట్ల బడ్డెట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇదివరకు మొదటి భాగం రూ.1300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ధురంధర్ 2 కేవలం ఐదు రోజుల్లోనే పెట్టుబడిని తిరిగి రాబట్టింది. నిపుణుల అంచనాల ప్రకారం ఈ సినిమా మొదటి భాగం కంటే 40% ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రూ.919 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. అందుకు కారణం ఆ ఒక్కటే.. శ్రీకాంత్..
ధురంధర్ ఫస్ట్ పార్ట్ దాదాపు 80 రోజుల పాటు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోయింది. ఇక ఇప్పుడు రెండవ భాగం రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా దాదాపు రెండు నెలలకు పైగా థియేటర్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని వసూల్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ కొల్లగొట్టనున్నట్లు తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రణవీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు.
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak: అందరు హీరోలతో చేశా.. కానీ నాగార్జునతో సినిమా ఎందుకు చేయాలేదంటే.. అసలు విషయం చెప్పిన వివి వినాయక్..
ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..
