AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs RR: వామ్మో.. ధోనీ సేనకు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన వైభవ్ సూర్యవంశీ.. ఏమన్నాడంటే?

Rajasthan Royals vs Chennai Super Kings: ఐపీఎల్ 2026 సమరానికి తెరలేవకముందే మైదానంలో సెగలు పుడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడాలోకంలో చర్చనీయాంశమయ్యాయి. గత సీజన్ ఫలితాలను గుర్తు చేస్తూ, ఈసారి కూడా చెన్నైని మట్టికరిపిస్తామని ధీమా వ్యక్తం చేయడంతో ఇరు జట్ల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

CSK vs RR: వామ్మో.. ధోనీ సేనకు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన వైభవ్ సూర్యవంశీ.. ఏమన్నాడంటే?
Ipl 2026, Vaibhav Sooryavanshi
Venkata Chari
|

Updated on: Mar 25, 2026 | 12:14 PM

Share

Vaibhav Sooryavanshi: వచ్చే మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే, అందరి దృష్టి మార్చి 30న గువహటి వేదికగా జరగనున్న రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్‌పై పడింది. రాజస్థాన్ జట్టుకు రెండో హోమ్ గ్రౌండ్‌గా ఉన్న గువహటిలో ఈ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందే రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, చెన్నై ఆటగాడు ఆయుష్ మాత్రే సమక్షంలో సీఎస్కేకు బహిరంగ సవాల్ విసిరాడు.

నమన్ అవార్డుల వేదికగా సంచలన వ్యాఖ్యలు..

నమన్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే పాల్గొన్నారు. వీరిద్దరూ అండర్-19 క్రికెట్‌లో కలిసి ఆడిన స్నేహితులే అయినప్పటికీ, ఐపీఎల్ వేదికగా మాత్రం ప్రత్యర్థులుగా మారారు. ఈ క్రమంలో వైభవ్ మాట్లాడుతూ, “నేను రాజస్థాన్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి చెన్నై జట్టు వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. ఈసారి ఆ స్కోరు 4-0 అవుతుంది” అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు.

ఇది కూడా చదవండి: Team India: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. ఓపెనర్‌గా సూర్యవంశీ.. ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ఇదే..?

ఇవి కూడా చదవండి

గత రికార్డులే వైభవ్ నమ్మకానికి కారణమా..?

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండుసార్లు తలపడగా, ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్థానే విజయం సాధించింది. మార్చి 30, 2025న జరిగిన మొదటి పోరులో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో గెలవగా, మే 20న జరిగిన రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా రెండో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇది కూడా చదవండి: షేన్ వార్న్ మాస్టర్ ప్లాన్.. రాజస్థాన్ రాయల్స్ డీల్‌తో తన పిల్లలకు వేల కోట్ల ఆస్తి.. ఎంతో తెలుసా?

గ్రూప్ దశలో హోరాహోరీ పోరు..

ఐపీఎల్ నిబంధనల ప్రకారం గ్రూప్ దశలో ప్రతి జట్టు మరో జట్టుతో రెండుసార్లు తలపడుతుంది. గత ఏడాది సాధించిన రెండు విజయాలకు తోడు, ఈ ఏడాది కూడా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మొత్తంగా 4-0 ఆధిక్యాన్ని సాధిస్తామని వైభవ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ధోనీ మార్గదర్శకత్వంలో నడిచే చెన్నై సూపర్ కింగ్స్ ఈ సవాల్‌కు మైదానంలో ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ధోనీ సేనకు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన వైభవ్ సూర్యవంశీ..!
ధోనీ సేనకు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన వైభవ్ సూర్యవంశీ..!
సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క
ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. మేఘాలపైన గ్రామం.. వర్షమే పడదు!
ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. మేఘాలపైన గ్రామం.. వర్షమే పడదు!