AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : మళ్లీ బరిలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడతాడా?

Vaibhav Sooryavanshi : దాంబుల్లాలో జరగనున్న కీలక ట్రై సిరీస్ మ్యాచ్‌లో ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్లు తలపడనున్నాయి. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలిచింది. తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ ప్రదర్శనతో పాటు పిచ్, వాతావరణ పరిస్థితులు కూడా మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయనున్నాయి.

Vaibhav Sooryavanshi : మళ్లీ బరిలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ  విరుచుకుపడతాడా?
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Jun 15, 2026 | 11:16 AM

Share

Vaibhav Sooryavanshi : భారత యువ క్రికెట్ జట్టు మరో భారీ పోరాటానికి సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ట్రై సిరీస్‌లో భాగంగా సోమవారం జూన్ 15న ఇండియా A, శ్రీలంక A జట్ల మధ్య అత్యంత కీలకమైన లీగ్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని రణగిరి దాంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకే ప్రారంభం కానుంది. టోర్నమెంట్‌లో ఫైనల్ బెర్త్ కోసం పోటీ తీవ్రంగా మారిన నేపథ్యంలో, ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఒక అగ్నిపరీక్ష లాంటిదని చెప్పాలి. ఇక్కడ గెలిచే జట్టు ఫైనల్ వైపు బలంగా అడుగులు వేస్తుంది.

ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లు తలపడటం ఇది రెండోసారి. అంతకుముందు జరిగిన మొదటి మ్యాచ్‌లో ఇండియా A జట్టు ఉత్కంఠభరిత పోరాటంలో శ్రీలంక A జట్టును కేవలం 8 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్‌లో లంక జట్టు విజయానికి చాలా దగ్గరగా వచ్చినప్పటికీ, ఆఖరి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయి చేతులారా మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇప్పుడు స్వదేశీ మైదానంలో ఆడుతున్న శ్రీలంక జట్టు ఎలాగైనా ఆనాటి ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది. అందువల్ల ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి టీం ఇండియా యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్‌లో వైభవ్ కేవలం 14 పరుగులకే అవుట్ అయి నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత జరిగిన అఫ్గానిస్తాన్ A మ్యాచ్‌లో తన అసలైన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా 200 స్ట్రైక్ రేట్‌తో కేవలం కొన్ని బంతుల్లోనే 44 పరుగులు దంచి కొట్టాడు. నేటి మ్యాచ్‌లో కూడా వైభవ్ లంక బౌలర్లను టార్గెట్ చేస్తూ పవర్‌ప్లేలో పరుగుల తుఫాన్ సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

టీం ఇండియాను ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ తిలక్ వర్మ, సీనియర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌లపై ఈ మ్యాచ్‌లో భారీ బాధ్యత ఉంది. వీరిద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. జట్టును ఫైనల్‌కు చేర్చాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు క్రీజులో నిలదొక్కుకుని భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. దాంబుల్లా పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టి, లంక స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొని మిడిల్ ఓవర్లలో రన్ రేట్ తగ్గకుండా చూడటం వీరిద్దరికీ పెద్ద సవాల్ కానుంది.

దాంబుల్లా పిచ్ రిపోర్ట్ ప్రకారం.. ప్రారంభ ఓవర్లలో కొత్త బంతితో పేస్ బౌలర్లకు మంచి స్వింగ్, బౌన్స్ లభిస్తుంది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటింగ్‌కు పూర్తిగా లైన్ క్లియర్ అవుతుంది. అయితే, ఈ మ్యాచ్ ఫలితాన్ని వాతావరణం కూడా శాసించే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా దాంబుల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పిచ్‌పై తేమ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ మధ్యలో వర్షం పడితే డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (DLS) రూల్ ప్రకారం టార్గెట్‌ను మారుస్తారు. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకుని, వాతావరణాన్ని బట్టి తమ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడతాడా?
శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడతాడా?
ఏటీఎంకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే డబ్బులు హాంఫట్
ఏటీఎంకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే డబ్బులు హాంఫట్
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలోని 10 కీలక అంశాలు ఇవే!
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలోని 10 కీలక అంశాలు ఇవే!
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు..
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు..
షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు..
షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు..
అమెరికాలో ‘దెయ్యాల ఊరు’.. అక్కడ ఎవరూ ఉండరు.. అయినా కోట్లలో ఖర్చు!
అమెరికాలో ‘దెయ్యాల ఊరు’.. అక్కడ ఎవరూ ఉండరు.. అయినా కోట్లలో ఖర్చు!
మెన్స్ or ఉమెన్స్.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
మెన్స్ or ఉమెన్స్.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
బడికి వెళ్లే పిల్లలకు అమృతం.. ఒక్కటి తింటే చాలు వెయ్యేనుగుల బలం
బడికి వెళ్లే పిల్లలకు అమృతం.. ఒక్కటి తింటే చాలు వెయ్యేనుగుల బలం
మ్యాచ్‌ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్
మ్యాచ్‌ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్
ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో తేలిన డెడ్ బాడీ
ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో తేలిన డెడ్ బాడీ