క్రికెట్ హిస్టరీలోనే బ్లాక్ డే.. సిగ్గుమాలిన పనితో అడ్డంగా బుక్కైన ఆస్ట్రేలియా ప్లేయర్లు.. కట్ చేస్తే..
On This Day in Cricket History: క్రికెట్ చరిత్రలో ఎన్నో గొప్ప సంఘటనలు ఉన్నప్పటికీ కొన్ని ఘటనలు ఈ క్రీడ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ఎనిమిదేళ్ల క్రితం మార్చి 24 నాడు జరిగిన ఒక సంఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ నేతృత్వంలో జరిగిన ఈ ఘటన క్రికెట్ చరిత్రలో మాయని మచ్చగా నిలిచింది.

Australia Ball Tampering Scandal: దాదాపు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన క్రికెట్ లో అనేక స్ఫూర్తిదాయక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. అయితే కొన్ని సంఘటనలు మాత్రం మాయని మచ్చలా తయారయ్యాయి. అభిమానుల అల్లర్లు, ఆటగాళ్ల మధ్య గొడవలు మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలు గతంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనల్లో అత్యంత వివాదాస్పదమైనది దక్షిణాఫ్రికా మైదానంలో జరిగిన ఈ సంఘటన. అందేంటో ఇప్పటికే మీకు గుర్తుకు వచ్చిదనుకుంటాం.. అసలేంటి ఆ వివాదం, క్రికెట్ చరిత్రపై ఎంత ప్రభావం చూపిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మ్యాచ్ సమయంలో జరిగిన అనూహ్య పరిణామం..
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ మూడవ మ్యాచ్ లో ఈ పరిణామం చోటు చేసుకుంది. మ్యాచ్ మూడవ రోజు ఆట కొనసాగుతుండగా మైదానంలోని పెద్ద తెరపై ఒక వీడియో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో ఆస్ట్రేలియా ఆటగాడు బాంక్రాఫ్ట్ తన జేబులో నుంచి ఒక వస్తువును తీసి బంతిపై రుద్దుతున్నట్లు కనిపించింది. ఈ దృశ్యం ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
కెప్టెన్ స్మిత్, వార్నర్ పాత్ర..
ఈ ఘటనపై అంపైర్లు వెంటనే స్పందించి బాంక్రాఫ్ట్, కెప్టెన్ స్మిత్ ను ప్రశ్నించారు. మొదట్లో విషయం దాచిపెట్టే ప్రయత్నం జరిగినప్పటికీ చివరికి నిజం బయటపడింది. బాంక్రాఫ్ట్ ప్రత్యేక కాగితాన్ని (శాండ్ పేపర్) ఉపయోగించి బంతి స్వభావాన్ని మార్చేందుకు ప్రయత్నించినట్టు ఒప్పుకున్నాడు. కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్ కు ఈ విషయం తెలిసినట్టు వెల్లడైంది. ఈ చర్యపై వారు సిగ్గుపడ్డామని తెలిపారు.
క్రికెట్ ప్రపంచంలో సంచలనం..
బంతితో చెలగాటం ఆడటం క్రికెట్ నియమాలకు విరుద్ధం కావడంతో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇది సాధారణ తప్పిదం కాకుండా ముందుగానే ప్రణాళికతో చేసిన చర్య కావడం మరింత వివాదాస్పదమైంది. అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు
నిషేధాలు, పరిణామాలు..
ఈ ఘటనపై ఆస్ట్రేలియా క్రికెట్ సంస్థ కఠిన చర్యలు తీసుకుంది. ముగ్గురు ఆటగాళ్లను వెంటనే స్వదేశానికి పంపించింది. అనంతరం వారిపై ఒక సంవత్సర నిషేధం విధించింది. తదుపరి మ్యాచ్ కు కొత్త కెప్టెన్ బాధ్యతలు చేపట్టగా జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని సంవత్సరాల తరువాత ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురూ 2019లో తిరిగి వచ్చారు. అయితే, బాన్‌క్రాఫ్ట్ కేవలం ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. వార్నర్ తన రిటైర్మెంట్ వరకు జట్టులోనే కొనసాగగా, స్మిత్ ఇప్పటికీ ఆడుతున్నాడు.
ఈ సంఘటన క్రికెట్ చరిత్రలో ఒక హెచ్చరికగా నిలిచింది. నిష్పక్షపాతంగా ఆడే క్రీడలో మోసం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఇది చూపించింది. ఈ ఘటన తరువాత నియమాలు మరింత కఠినతరం చేశారు. ఆట ప్రతిష్ఠను కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
