AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి చిట్టా చాంతాడంత..

పూజలు, ప్రత్యేక పరిహారాల పేరుతో లక్షల రూపాయలు మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నారై పూజారి చామర్తి రామ లచ్చారావును శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నుంచి రూ.20 లక్షలు మోసం చేసిన కేసుతో పాటు అమెరికాలోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి చిట్టా చాంతాడంత..
Nri Priest Arrested At Hyderabad Airport
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 27, 2026 | 3:40 PM

Share

పూజలు, పరిహారాలు చేస్తానంటూ నమ్మించి లక్షల రూపాయలు మోసం చేసిన ఓ ఎన్నారై పూజారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అరెస్టయిన వ్యక్తిని చామర్తి రామ లచ్చారావుగా పోలీసులు గుర్తించారు. పూజల పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రూ.20 లక్షలు మోసం చేయడమే కాకుండా.. చేతబడి చేస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు విదేశాలకు వెళ్లిపోవడంతో అతడిపై లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు.

ఇదే సమయంలో అమెరికాలో కూడా ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు సమాచారం రావడంతో కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. అమెరికాలో అతడు నిర్వహిస్తున్న ఆలయానికి సంబంధించిన వివాదాలు, అక్కడ నమోదైన కేసుల నేపథ్యంలో భయంతో భారత్‌కు తిరిగి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.. అనంతరం సంబంధిత పోలీసులకు అప్పగించారు.

ఈ కేసులో మరికొందరు బాధితులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో చామర్తి రామ లచ్చారావు మోసాల వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పూజలు, ప్రత్యేక పరిహారాలు, చేతబడి తొలగిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వీడియో చూడండి..

Follow Us
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి మామూలోడు కాదుగా
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి మామూలోడు కాదుగా
సేమ్ టూ సేమ్.. అలాంటి భయంకరమైన సస్సెన్స్ సినిమా గురించి తెలుసా..
సేమ్ టూ సేమ్.. అలాంటి భయంకరమైన సస్సెన్స్ సినిమా గురించి తెలుసా..
పేదోళ్ల మిరియాల అన్నం.. తక్కువ ఖర్చుతో కమ్మని రుచి
పేదోళ్ల మిరియాల అన్నం.. తక్కువ ఖర్చుతో కమ్మని రుచి
శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..పండితుల సూచనలు?
శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..పండితుల సూచనలు?
ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!
ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!
భరత్ తివారీ ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరిగిందా?
భరత్ తివారీ ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరిగిందా?
నువ్వేం మగాడివిరా.. పుట్టబోయే బిడ్డకు DNA టెస్టు చేయాలంటూ..
నువ్వేం మగాడివిరా.. పుట్టబోయే బిడ్డకు DNA టెస్టు చేయాలంటూ..
10 ఏళ్లలో రూ.33 లక్షలకు పైగా లాభం.. కాసుల వర్షం కురిపించిన ఫండ్
10 ఏళ్లలో రూ.33 లక్షలకు పైగా లాభం.. కాసుల వర్షం కురిపించిన ఫండ్
స్ట్రాబెర్రీ మూన్.. జూన్ 29 రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఈ టైమ్‌లో..
స్ట్రాబెర్రీ మూన్.. జూన్ 29 రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఈ టైమ్‌లో..
కాల్చిన ఎండు చేపల కూర.. వాసన అస్సలు ఉండదు..
కాల్చిన ఎండు చేపల కూర.. వాసన అస్సలు ఉండదు..