AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Erragadda History: ఎర్రగడ్డకు ఆ పేరు ఎలా వచ్చింది? మెంటల్ హాస్పిటల్ కాకుండా దాని చరిత్ర ఏంటో తెలుసా?

ఎర్రగడ్డ అంటే కేవలం మానసిక ఆసుపత్రి మాత్రమే కాదు. ఎరుపు మట్టి కొండల నుండి 'ఎర్రగడ్డ' అనే పేరుతో పిలువబడిన ఈ ప్రాంతం, నిజాం కాలం నుండే వైద్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. నేడు ఇది హైదరాబాద్‌లో ఒక కీలకమైన వాణిజ్య, రవాణా, వైద్య కేంద్రంగా పరిణామం చెందింది.

Erragadda History: ఎర్రగడ్డకు ఆ పేరు ఎలా వచ్చింది? మెంటల్ హాస్పిటల్ కాకుండా దాని చరిత్ర ఏంటో తెలుసా?
Erragadda History
SN Pasha
|

Updated on: Jun 27, 2026 | 3:53 PM

Share

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ అనే పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది మెంటల్ హాస్పిటల్ లేదా పిచ్చాస్పత్రి. చాలా మంది కాస్త తిక్క తిక్కగా మాట్లాడితే సరదాగా ఎర్రగడ్డ నుంచి వచ్చాడని, లేదా ఎర్రగడ్డకు పంపిస్తాను అని అంటుంటారు. అయితే ఎర్రగడ్డ చరిత్ర దానికంటే ఎంతో పురాతనమైనది. ఒకప్పుడు నగర శివారులో ఉన్న ఈ ప్రాంతం, నేడు హైదరాబాద్‌లో అత్యంత కీలకమైన వాణిజ్య, వైద్య, రవాణా కేంద్రాల్లో ఒకటిగా ఎదిగింది. అంతేకాదు ఈ ప్రాంతం పేరుకు కూడా ఆసక్తికరమైన చరిత్ర ఉంది.

‘ఎర్రగడ్డ’ అనే పేరు పూర్తిగా తెలుగు మూలాల నుంచే వచ్చింది. ‘ఎర్ర’ అంటే ఎరుపు రంగు, ‘గడ్డ’ అంటే ఎత్తైన భూభాగం లేదా మట్టిదిబ్బ. గతంలో ఈ ప్రాంతమంతా ఎర్రని రాతి కొండలు, ఎర్ర నేలతో ఉండటంతో ప్రజలు దీనిని ‘ఎర్రగడ్డ’గా పిలవడం ప్రారంభించారు. కాలక్రమేణా అదే అధికారిక పేరుగా స్థిరపడింది. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల మాదిరిగానే, ఈ పేరు కూడా అక్కడి భౌగోళిక స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. నిజాం పాలనలో ఎర్రగడ్డకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. విశాలమైన ఖాళీ భూములు, కొండ ప్రాంతాలు ఉండటంతో ప్రభుత్వ సంస్థలు, వైద్యశాలలు ఇక్కడ ఏర్పాటుకు అనుకూలంగా మారింది. ప్రస్తుతం ప్రసిద్ధి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ చరిత్ర కూడా నిజాం కాలాని చెందిందే. ఈ సంస్థ తొలుత 1895లో స్థాపించబడి, తరువాత మహారాష్ట్రలోని జల్నాకు తరలించారు. మళ్లీ తిరిగి 1953లో జల్నా నుంచి హైదరాబాద్‌లోని ఎర్రగడ్డకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి తెలంగాణలో మానసిక ఆరోగ్య సేవలకు ఇది ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది.

అయితే ఎర్రగడ్డ ప్రాధాన్యం కేవలం మానసిక ఆసుపత్రితో ముగిసిపోదు. ఇక్కడే ఉన్న టీబీ అండ్ చెస్ట్ హాస్పిటల్ రాష్ట్రంలో అతిపెద్ద క్షయవ్యాధి చికిత్స కేంద్రాల్లో ఒకటి. నిజాం కాలంలో నిర్మించిన ఇర్రనుమా ప్యాలెస్‌ను తరువాత ఆసుపత్రిగా మార్చారు. దీంతో ఎర్రగడ్డ వైద్య సేవల పరంగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. రవాణా పరంగా కూడా ఎర్రగడ్డ కీలక ప్రాంతం. అమీర్‌పేట్, ఎస్.ఆర్.నగర్, భారత్‌నగర్, సనత్‌నగర్, కూకట్‌పల్లి వంటి ప్రధాన ప్రాంతాలకు అనుసంధానంగా ఉండటంతో ఇది నగరంలోని ముఖ్య జంక్షన్‌గా అభివృద్ధి చెందింది. మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో వాణిజ్య, నివాస, కార్యాలయాల అభివృద్ధి మరింత వేగం అందుకుంది. ఎర్రగడ్డ పరిసర ప్రాంతాల్లో నిజాం కాలం నాటి వారసత్వ కట్టడాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సమీపంలోని ఎర్రం మంజిల్ (ఇరామ్ మంజిల్) రాజభవనం ఈ ప్రాంత చారిత్రక వైభవాన్ని గుర్తు చేస్తుంది. ‘ఇరామ్’ అనే పర్షియన్ పదానికి ‘స్వర్గం’ అనే అర్థం ఉండగా, అది ఎర్రగడ్డ కొండలపై నిర్మించబడినందున ‘ఎర్రం మంజిల్’ అనే పేరు కూడా ప్రాచుర్యం పొందింది.

Follow Us
ఎర్రగడ్డకు ఆ పేరెలా వచ్చింది? 99 శాతం మందికి తెలియదు
ఎర్రగడ్డకు ఆ పేరెలా వచ్చింది? 99 శాతం మందికి తెలియదు
శత్రువులు, పోటీదారులపై ఈ రాశుల వారిదే పైచేయి..!
శత్రువులు, పోటీదారులపై ఈ రాశుల వారిదే పైచేయి..!
నైవేద్యం ఎప్పుడూ ఆగదు.. ఒక్కరోజు ఆపితే కృష్ణుడి విగ్రహం చిన్న...
నైవేద్యం ఎప్పుడూ ఆగదు.. ఒక్కరోజు ఆపితే కృష్ణుడి విగ్రహం చిన్న...
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి మామూలోడు కాదుగా
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి మామూలోడు కాదుగా
సేమ్ టూ సేమ్.. అలాంటి భయంకరమైన సస్సెన్స్ సినిమా గురించి తెలుసా..
సేమ్ టూ సేమ్.. అలాంటి భయంకరమైన సస్సెన్స్ సినిమా గురించి తెలుసా..
పేదోళ్ల మిరియాల అన్నం.. తక్కువ ఖర్చుతో కమ్మని రుచి
పేదోళ్ల మిరియాల అన్నం.. తక్కువ ఖర్చుతో కమ్మని రుచి
శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..పండితుల సూచనలు?
శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..పండితుల సూచనలు?
ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!
ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!
భరత్ తివారీ ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరిగిందా?
భరత్ తివారీ ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరిగిందా?
నువ్వేం మగాడివిరా.. పుట్టబోయే బిడ్డకు DNA టెస్టు చేయాలంటూ..
నువ్వేం మగాడివిరా.. పుట్టబోయే బిడ్డకు DNA టెస్టు చేయాలంటూ..