AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముక్క మెత్తగా, గ్రేవీ టేస్ట్‌గా.. రాజస్థానీ స్టైల్‌లో మటన్ కర్రీ ఎలా వండాలంటే?

మటన్ కర్రీ ఎప్పుడూ వండుకునే విధంగా కాకుండా కాస్త కొత్తగా వండుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ సండే మీరు రాజస్థానీ స్టైల్‌లో ఇలా మటన్ కర్రీ ప్రిపేర్ చనేయండి. ముక్క మెత్తగా, గ్రేవీ టేస్ట్‌గా ఉండటంతో ఇంటిల్లిపాదీ చాలా సంతోషంగా తింటారు. కాగా ఇది ఎలా వండాలి అంటే?

Samatha J
|

Updated on: Jun 27, 2026 | 1:20 PM

Share
కావాల్సిన పదార్థాలు : మటన్, పెరుగు, ఆవ నూనె, లవంగాలు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్టార్ అనాసా, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, కారం, ఉల్లిపాయ, వెల్లుల్లి, పసుపు, నీళ్లు, నెయ్యి, కొత్తిమీర తరుగు, పూదీనా తరుగు.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఆవ నూనె వేసి బాగా మరగ బెట్టాలి. పొగలు వస్తున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మల్లీ స్టవ్ ఆన్ చేసి, నూనె ను గోరు వెచ్చగా వేడి చేసి అందులో షాజీరా, దాల్చిన చక్కె వేయాలి.

2 / 5
తర్వాత బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, స్టార్ అనాసా వేసి , పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత  వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మటన్ కర్రీ వేసుకోవాలి. దాదాపు ఇరవై నిమిషాల పాటు మటను లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. నూనెలోనే మటన్ కర్రీ 25 శాతం ఉడకాలి.

3 / 5
తర్వాత ఇందులో కొంచెం వేడి నీరు పోయాలి. తర్వాత చికెడు పెరుగు, కారం, గరం మసాలాలు వేసి బాగా ఉడికించుకోవాలి. ముక్క మెత్తగా, ఉడికి గ్రేవీ వచ్చే వరకు మంచిగా ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన ముక్క చాలా రుచికరంగా ఉంటుంది. ఇక ఇది బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి.

4 / 5
 ఇలా పదినిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర, పూదీనా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రాజస్థానీ స్టైల్ మటన్ కర్రీ రెడీ, మరి ఈ సండే మీరు కూడా ట్రై చేయండి.

5 / 5
Follow Us