AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ కోడి పిల్లల మధ్య ఉన్న 5 నిమ్మకాయలను గుర్తిస్తే.. మీరే తోపులు!

తరచూ సోషల్ మీడియాలో అనేక చిత్రాలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ వాటిలో కేవలం ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మాత్రమే నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఇవి వారి తెలివితేటలను సవాల్ చేయడమే కాకుండా, నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలోనూ సహాయపడతాయి. అందుకే జనాలు వీటిని ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ కోడి పిల్లల మధ్య ఉన్న 5 నిమ్మకాయలను గుర్తిస్తే.. మీరే తోపులు!
Optical Illusion
Anand T
|

Updated on: Jun 27, 2026 | 1:14 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కేవలం మన కళ్లకు, బ్రెయిన్‌కు పని చెప్పడమే కాకుండా మన తెలివితేటలను, ఆలోచనా శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. అందుకే చాలా మంది సమయం దొరికిన ప్రతిసారీ వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వీటిని పరిష్కరించినప్పుడు వచ్చే ఫీలింగ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తరచూ వీటిని సాల్వ్ చేసేందుకు ప్రజలు ఇష్టపడతారు. అలాగే తమకు తెలిసిన వారికి షేర్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొస్తూ ఉంటారు.

మీ బ్రెయిన్‌కు ఒక చిన్న పరీక్ష!

తాజాగా ఇలాంటి ఒక ఫోటోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. మీరు కూడా మీ తెలివితేటలను పరీక్షించుకోవాలి అనుకుంటే.. ఇది మీకు మంచి అవకాశం. అవును, మీరు కూడా అందరితో పాటు ఈ చిత్రంలో ఉన్న చిక్కుముడిని విప్పేందుకు ప్రయత్నించండి. తద్వారా మీ బ్రెయిన్ యాక్టివ్‌గా పనిచేసి.. మీ పరిశీలనా శక్తి, ఆలోచనా శక్తి పెరుగుతాయి. ఈ ప్రక్రియ భవిష్యత్తులో మీకు ఏవైనా సమస్యలు వస్తే.. వాటిని ఎలా సాల్వ్ చేయాలో నేర్పుతుంది. మరి ఇప్పుడు ఈ వైరల్ చిత్రంలో ఏముందో చూద్దాం.

టాస్క్ ఏంటంటే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో మీకు చూడగానే చాలా కోడిపిల్లలు కనిపిస్తాయి. అయితే అక్కడ కోడిపిల్లలు మాత్రమే ఉన్నాయి అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే వాటి మధ్య 5 నిమ్మకాయలు కూడా దాక్కుని ఉన్నాయి.కేవలం 10 సెకన్లలో ఆ కోడిపిల్లల మధ్య ఉన్న 5 నిమ్మకాయలను గుర్తించాల్సి ఉంటుంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ నిమ్మకాయలు ఎక్కడ ఉన్నాయో సులువుగా కనిపెట్టొచ్చు. కాబట్టి మీరు ఈ సవాల్‌కు సిద్ధమైతే.. మీ టైం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది!

సమాధానం ఇక్కడే ఉంది..

మీరు పై చిత్రంలో ఉన్న నిమ్మకాయలను 10 సెకన్లలోనే గుర్తించాల్సి ఉంటుంది. కేవలం మెరుగైన పరిశీలనా నైపుణ్యం కలిగిన వాళ్లు మాత్రమే ఆ నిమ్మకాయలను త్వరగా గుర్తిస్తారు. ఒకవేళ నిర్ణీత సమయంలో మీరు వాటిని గుర్తించలేకపోయినా.. ఏమీ పర్లేదు. వాటిని కనిపెట్టేందుకు మేము మీకు సహాయం చేస్తాం. ఈ క్రింద ఇచ్చిన చిత్రంలో మీ కోసం నిమ్మకాయలను హైలైట్ చేసి చూపిస్తున్నాం, అక్కడ మీరు సమాధానం చూసుకోవచ్చు.

Optical Illusion 1

Optical Illusion 1

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us