AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: కావ్యపాపకు భారమైన ముగ్గురు.. కిలోల కొద్ది జండూబామ్ రాసినా తగ్గని తలనొప్పి వీళ్లు..?

Sunrisers Hyderabad Issues: ఐపీఎల్ 2026 సీజన్ సమరానికి సర్వం సిద్ధమైంది. వేలంలో భారీ బడ్జెట్‌తో పటిష్టమైన జట్టును కూర్చుకున్నప్పటికీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మేనేజ్‌మెంట్‌ను కొన్ని లెక్కలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా భారీ ధర పలికిన స్టార్ ప్లేయర్లు, ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్న బౌలర్లు జట్టు సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆటగాళ్ల ప్రదర్శన ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీకి అగ్నిపరీక్షగా మారింది.

IPL 2026: కావ్యపాపకు భారమైన ముగ్గురు.. కిలోల కొద్ది జండూబామ్ రాసినా తగ్గని తలనొప్పి వీళ్లు..?
Srh Players
Venkata Chari
|

Updated on: Mar 24, 2026 | 8:19 AM

Share

Sunrisers Hyderabad Issues: హైదరాబాద్ జట్టు కొత్త సీజన్ ను బెంగళూరు జట్టుతో మార్చి 28న బెంగళూరు వేదికగా ప్రారంభించనుంది. ప్రారంభ మ్యాచ్ నుంచే గట్టి పోటీ ఎదురుకానుంది. ఇషాన్ కిషన్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టుకు ప్రారంభ దశలోనే కీలక సవాళ్లు ఎదురవుతున్నాయి. అనంతరం కోల్‌కతా, లక్నో జట్లతో వరుసగా మ్యాచ్‌లు ఉండటంతో జట్టు స్థిరత్వం చాలా కీలకంగా మారింది. జట్టులోని కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శన ఈ సీజన్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

1. లియామ్ లివింగ్‌స్టోన్: భారీ ధర.. ఫామ్ లేమి..

గత వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదులుకున్న లియామ్ లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ ఏకంగా రూ. 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్ కోటాలో జట్టుకు బలం చేకూరుస్తాడని ఆశించినా, అతని ప్రస్తుత ఫామ్ ఆశాజనకంగా లేదు. 2025 సీజన్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి, 16 సగటుతో ఘోరంగా విఫలమయ్యాడు. అంతేకాకుండా, ఇంగ్లాండ్ జాతీయ జట్టులోనూ అతను చోటు కోల్పోయాడు. ఇంతటి భారీ ధర వెచ్చించిన ఆటగాడు మళ్ళీ విఫలమైతే, అది జట్టుకు తీరని నష్టం కలిగిస్తుంది.

2. ప్యాట్ కమిన్స్: ఫిట్‌నెస్ సమస్యలు..

ఆస్ట్రేలియా దిగ్గజం ప్యాట్ కమిన్స్ ఎప్పుడూ సన్‌రైజర్స్‌కు వెన్నెముకగా ఉంటూ వచ్చారు. అయితే, ఐపీఎల్ 2026 ముందు ఆయనను గాయాల సమస్య వెంటాడుతోంది. పూర్తి సీజన్ అందుబాటులో ఉంటారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇషాన్ కిషన్ జట్టును నడిపిస్తున్నప్పటికీ, కమిన్స్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ లేకపోవడం డెత్ ఓవర్లలో జట్టును ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. నాయకత్వ లక్షణాలు, బౌలింగ్ నైపుణ్యం కలిగిన కమిన్స్ గైర్హాజరీ సన్‌రైజర్స్‌కు పెద్ద భారంగా మారనుంది.

3. నితీష్ కుమార్ రెడ్డి: నిలకడలేని ప్రదర్శన..

భారత యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై సన్‌రైజర్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, ఇటీవల అతని ఆటతీరు ఆందోళన కలిగిస్తోంది. 2025 సీజన్‌లో బ్యాటుతోనూ, బంతితోనూ చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేదు. అంతర్జాతీయ టీ20లలో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో లేదా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంలో నితీష్ విఫలమైతే, జట్టు తుది కూర్పులో మేనేజ్‌మెంట్‌కు తలనొప్పులు తప్పవు.

ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ ఫామ్‌ను అందుకోకుంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కల ఈసారి కూడా అసంపూర్తిగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. మొత్తంగా హైదరాబాద్ జట్టు బలంగా కనిపించినప్పటికీ ఈ ముగ్గురు ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి సీజన్ ఫలితం మారే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us