AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: కల్కి సెట్‌లో ప్రభాస్.. మరి ఫౌజీ స్టేటసేంటి..?

Prabhas: కల్కి సెట్‌లో ప్రభాస్.. మరి ఫౌజీ స్టేటసేంటి..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 16, 2026 | 6:59 PM

Share

‘ది రాజా సాబ్‌’ తర్వాత ప్రభాస్‌ తదుపరి సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’, సందీప్‌ రెడ్డి వంగా ‘స్పిరిట్‌’, ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ గురించి పలు అప్‌డేట్స్‌ ప్రచారంలో ఉన్నాయి. ‘ఫౌజీ’ చిత్రీకరణ కొనసాగుతుండగా, అక్టోబర్‌ చివరి నుంచి ‘కల్కి 2’ షూటింగ్‌లో ప్రభాస్‌ పాల్గొంటారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే షూటింగ్‌ షెడ్యూళ్లు, టీజర్‌ విడుదలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ది రాజాసాబ్‌ ఫెయిల్యూర్‌ తరువాత బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఫౌజీ, స్పిరిట్‌, కల్కి 2 సినిమాలు సెట్స్ మీద ఉండటంతో ప్రభాస్‌ ఎప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇస్తారు..? ఏ సినిమా స్టేటస్‌ ఏంటన్న విషయంలో కన్‌ఫ్యూజన్‌ కనిపిస్తోంది. ఇంతకీ ప్రభాస్ సినిమాలకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి..? పాన్ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో వాయిదా పడింది. ఫౌజీ షూటింగ్ డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ట్రై చేస్తోంది మూవీ టీమ్‌. అయితే ఈ టైమ్‌లో ప్రభాస్‌ కల్కి 2 సెట్‌లో అడుగుపెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ నెలాఖరు నుంచే ప్రభాస్ కల్కి 2 షూటింగ్‌లో జాయిన్ కానున్నారని, వచ్చే షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఫౌజీ సెట్స్‌ మీద ఉండగానే కల్కి సీక్వెల్‌ మీద కూడా డార్లింగ్ ఫోకస్ పెడుతుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ రెండు సినిమాలతో పాటు స్పిరిట్ కూడా సెట్స్ మీదే ఉంది. అంటే ఒకేసారి మూడు భారీ ప్రాజెక్ట్స్‌ను ప్యారలల్‌గా డీల్ చేయబోతున్నారు ప్రభాస్‌. ప్రస్తుతం ఫౌజీ కోసం ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ సినిమా నుంచి స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు కల్కి 2 నుంచి కూడా క్రేజీ అప్‌డేట్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మొత్తానికి అటు ఫౌజీ యాక్షన్ ఎపిసోడ్స్, ఇటు కల్కి 2 వర్క్‌, స్పిరిట్ ప్రిపరేషన్‌తో పాన్ ఇండియా స్టార్ ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. మరి ఈ సినిమాలు ఎప్పటికి పూర్తవుతాయో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు రద్దయినా, ఆలస్యమైనా.. పూర్తి డబ్బులు రిఫండ్.. రైల్వే నిబంధనలు ఇవే!

Bigg Boss Telugu 10: ప్రేమే ఆమెకు శాపంగా.. డేంజర్‌ జోన్‌లో లవ్ బర్డ్‌…!

దేశం వదిలిపోవాలంటూ.. బాలీవుడ్ హీరోకు నోటీసులు

The Raja Saab: రాజాసాబే కాదు.. ఈయన చెప్పిన రీజనూ ఫెయిలే

Salman Khan: మళ్లీ అదే చెత్త ప్రశ్న.. కరణ్ దెబ్బకు షాకైన సల్మాన్

Follow Us