AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్ఞానోదయం.. బాలీవుడ్‌కు దూరం దూరం..!

జ్ఞానోదయం.. బాలీవుడ్‌కు దూరం దూరం..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 16, 2026 | 6:58 PM

Share

పాన్‌ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టిన మహేశ్‌బాబు, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ తమ తదుపరి సినిమాల కోసం దక్షిణాది దర్శకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ మొదలైంది. రాజమౌళితో మహేశ్‌బాబు ‘వారణాసి’, సందీప్‌ రెడ్డి వంగాతో ప్రభాస్‌ ‘స్పిరిట్‌’, అట్లీతో అల్లు అర్జున్‌ ‘రాకా’ వంటి ప్రాజెక్టులు ఆసక్తి పెంచుతున్నాయి. బాలీవుడ్‌ దర్శకులకు అవకాశాలు తగ్గాయా, లేక కథలు, దర్శకులపై నమ్మకమే ఎంపికకు కారణమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ దర్శకులకు మన స్టార్ హీరోలు ఎందుకు దూరంగా ఉంటున్నారు..? పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసిన మన హీరోలు.. కేవలం సౌత్ డైరెక్టర్లతోనే వరుసగా సినిమాలు ఫిక్స్ చేసుకోవడానికి కారణమేంటి..? నార్త్ దర్శకులు చెప్తున్న కథలు నచ్చట్లేదా లేదంటే వాళ్లపై పూర్తిగా నమ్మకం తగ్గిందా..? మన దర్శకుల విజన్‌పైనే హీరోలకు ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ ఉండటానికి కారణమేంటి..? బాలీవుడ్ డైరెక్టర్స్‌కి బాగా డిస్టేన్స్ మెయింటేన్ చేస్తున్నారు మన హీరోలు. మహేష్ బాబు విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళితో వారణాసి చేస్తున్నారు. నెక్ట్స్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా పేరు వినిపిస్తుంది. మొదట్నుంచీ తెలుగు దర్శకులకే ప్రాధాన్యత ఇస్తున్నారు సూపర్ స్టార్. ప్రభాస్ సైతం ఆదిపురుష్ తర్వాత తన లైనప్‌లో సౌత్ దర్శకులకే పెద్దపీట వేస్తున్నారు. ప్రభాస్ లైనప్ చూస్తే హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్‌తో కల్కి 2, ప్రశాంత్ నీల్‌తో సలార్ 2 వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అంటే ఒక్కో సినిమాకు ఒక్కో జోనర్ ఎంచుకుంటూనే, దర్శకుడి విషయంలో మాత్రం మనవాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఇది కేవలం కథల ఎంపికలో భాగమా? లేక ఆదిపురుష్ నేర్పించిన గుణపాఠమా అనేది సస్పెన్స్. అల్లు అర్జున్ కూడా సౌత్ దర్శకులనే నమ్ముకుంటున్నారు. పుష్ప తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా.. ప్రస్తుతం అట్లీతో రాకా, ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా, మలయాళ దర్శకుడు బాసిల్ జోసఫ్‌తో సూపర్ హీరో ప్రాజెక్ట్ అంటూ సౌత్ లైనప్ సెట్ చేసుకున్నారు బన్నీ. భాషతో సంబంధం లేకుండా సౌత్ టాలెంట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు రద్దయినా, ఆలస్యమైనా.. పూర్తి డబ్బులు రిఫండ్.. రైల్వే నిబంధనలు ఇవే!

Bigg Boss Telugu 10: ప్రేమే ఆమెకు శాపంగా.. డేంజర్‌ జోన్‌లో లవ్ బర్డ్‌…!

దేశం వదిలిపోవాలంటూ.. బాలీవుడ్ హీరోకు నోటీసులు

The Raja Saab: రాజాసాబే కాదు.. ఈయన చెప్పిన రీజనూ ఫెయిలే

Salman Khan: మళ్లీ అదే చెత్త ప్రశ్న.. కరణ్ దెబ్బకు షాకైన సల్మాన్

Follow Us