AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio IPO: జియో ఐపీఓతో రిలయన్స్ ఖాతాలో మరో ఘనత.. టాటా రికార్డ్ బద్దలే..!

జియో ఐపీఓపై దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెట్టుబడివర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్న క్రమంలో స్టాక్ మార్కెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. అయితే జియో ఐపీఓతో రిలయన్స్ గ్రూప్ కంపెనీ పెద్ద రికార్డును బద్దలు కొట్టనుంది.

Reliance Jio IPO: జియో ఐపీఓతో రిలయన్స్ ఖాతాలో మరో ఘనత.. టాటా రికార్డ్ బద్దలే..!
Jio Ipo
Venkatrao Lella
|

Updated on: Oct 17, 2026 | 1:14 PM

Share

రిలయన్స్ జియో ఐపీఓ మరో మైలురాయి సాధించనుంది. మార్కెట్ విలువలో టాటా ఇండస్ట్రీస్‌ను అధిగమించి మరో రికార్డ్ నెలకొల్పేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. అక్టోబర్ 21వ తేదీ నుంచి జియో ఐపీఓ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. దేశంలోనే అది పెద్ద ఐపీఓగా ఇది అవతరించగా.. మార్కెట్ విలువలో కూడా టాటాను దాటే అవకాశముంది. దీంతో భారతదేశంలో అత్యధిక మార్కెట్ విలువలో రిలయన్స్ ఇండస్ట్రీ అగ్రస్థానానికి చేరువలో ఉంది. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ కంపెనీ మార్కెట్ విలువ రూ.18.2 లక్షల కోట్లుగా ఉండగా.. జియో ఐపీతో మార్కెట్ విలువ రూ.10.3 లక్షల కోట్ల వరకు పెరగవచ్చు. దీని ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కె్ట్ విలువ మొత్తం రూ.28.5 లక్షలకు చేరుకునే అవకాశముందని మార్కె్ట్ వర్గాలు భావిస్తున్నాయి. జియో ఐపీఓతో రిలయన్స్ మార్కెట్ విలువ భారీగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

జియో ఐపీఓ రిలయన్స్ సంస్ధకు కింగ్ మేకర్‌గా మారనుంది. ప్రస్తుతం టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ.25.5 లక్షల కోట్లుగా ఉంది. దేశంలోనే అతిపెద్ద క్యాపిటలైజేషన్ కలిగిన సంస్థలగా ఉంది. అయితే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ జియో ఐపీఓతో రూ.10.3 లక్షల కోట్లు పెరిగే అవకాశాలున్నాయి. దీని వల్ల రిలయన్స్ గ్రూప్ కంపెనీ మార్కెట్ విలువ మరింత పెరిగే టాటాను అధిగమించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల దేశంలోనే అతిపెద్ద సంస్ధగా రిలయన్స్ నిలవగలదని అంటున్నారు. జియో ఐపీతో రిలయన్స్ ఆ స్థానానికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. జియో ఐపీఓ లిస్టింగ్ అయిన తర్వాత దేశంలోనే అతిపెద్ద వ్యాపార గ్రూపుగా రిలయన్స్ అవతరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా టాటాను ఎవరూ అధిగమించలేకపోతున్నారు. ఇప్పుడు రిలయన్స్ బద్దలు కొట్టనుందని అంటున్నారు.

జియో ఐపీఓకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

అక్టోబర్ 21వ తేదీన జియో ఐపీఓ ప్రారంభమవుతుండగా.. అక్టోబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కొ షేర్‌కు ధరల శ్రేణి రూ.1065 నుంచి రూ.1119 మధ్య ఉంంది. ఈ ఐపీఓ ద్వారా రూ.30,188 కోట్లు సమీకరించనున్నారు. స్టాక్ బ్రోకర్, బ్యాంక్, ఐపీఓ ఫ్లాట్ ఫామ్ ద్వారా జియో ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాన్, డీమ్యాట్ అకౌంట్ వివరాలను నమోదు చేసి కేటగిరీని ఎంచుకోవాల్సి ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిలయన్స్ నుంచి ఐపీఓ వచ్చింది. 2008లో రిలయన్స్ గ్రూప్, రిలయన్స్ పవర్ ఐపీఓలు తీసుకురాగా.. ఇప్పుడు జియో ఐపీఓ తీసుకొస్తుంది. రిలయన్స్ గ్రూప్‌కు ఈ కొత్త ఐపీఓ పెద్ద ప్రయోజనాన్ని చేకూర్చనుంనది స్టాక్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Follow Us