JCB కొంటే కొంటే మంచి లాభమా? నష్టమా? చాలా మందికి తెలియని విషయాలు ఇవే!

October 16, 2026

Subhash

JCB కొనడం చాలామందికి కల. కానీ రూ.30–35 లక్షలు పెట్టుబడి పెట్టే ముందు పని లభ్యత, నిర్వహణ ఖర్చులు, EMIల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

JCB కొనడం

ప్రస్తుతం కొన్ని ఫైనాన్స్ సంస్థలు 2–3 లక్షల అడ్వాన్స్‌తో JCB కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే తక్కువ అడ్వాన్స్ చూసి తొందరపడకండి.

తక్కువ అడ్వాన్స్‌తో కొనుగోలు

రోజుకు రూ.15,000–రూ.20,000 ఆదాయం వచ్చినా అదంతా లాభం కాదు. డీజిల్, డ్రైవర్ జీతం, నిర్వహణ, విడిభాగాల ఖర్చులు మినహాయించాలి.

రోజుకు రూ.20 వేల ఆదాయం

ఇంజిన్ ఆయిల్, హైడ్రాలిక్ పైపులు, టైర్లు, బకెట్ అరుగుదల వంటి ఖర్చులు ఉంటాయి. వీటితోపాటు నెలవారీ EMI కూడా లెక్కలోకి తీసుకోవాలి.

నిర్వహణ ఖర్చులు తప్పవు

కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్–జూన్ నెలల్లో పనులు ఎక్కువగా ఉండొచ్చు. వర్షాకాలం లేదా ఇతర నెలల్లో పని తగ్గితే ఆదాయం పడిపోవచ్చు.

సీజన్‌లోనే ఎక్కువ పని

పని లేని నెలల్లోనూ EMIలు చెల్లించాలి. మారిటోరియం లభించినా చెల్లింపులు పూర్తిగా మాఫీ అవుతాయని భావించకండి. ఇలాంటి సమయంలో  నష్టాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

EMIలతో ఆర్థిక ఒత్తిడి

JCB ఆదాయంపైనే ఆధారపడకుండా వ్యవసాయం లేదా ఇతర ఆదాయ వనరులు ఉండటం ఉపయోగకరం. యంత్రాల నిర్వహణపై అనుభవం కూడా అవసరం.

అదనపు ఆదాయం అవసరం

పని ఒప్పందాలు, స్థానిక పోటీ, డీజిల్ ఖర్చులు, EMIలు, అత్యవసర మరమ్మతుల కోసం నిధులు సిద్ధం చేసుకోండి. సరైన ప్రణాళిక ఉంటేనే JCB వ్యాపారం నిలకడగా సాగుతుంది.

కొనేముందు ఈ లెక్కలు వేయండి