నెలకు రూ.2 వేల పొదుపుతో రూ.కోటి సంపాదన.. బెస్ట్ మార్గం ఇదే..
Venkatrao Lella
Images: Pinterest
16 OCT 2026
తమకు వచ్చే నెల జీతంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటే.. దీర్ఘకాలంలో భారీ లాభం వచ్చే సేవింగ్స్ స్కీమ్స్ కోసం చాలామంది వెతుకుంటారు. ఇలాంటివారికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) రూపంలో పెట్టుబడి పెట్టకలిగే ఫండ్స్ చాలా ఉపయోగపడతాయి.
సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతీ నెలా రూ.2 వేలు పొదుపు చేసుకుంటే మీరు రూ.కోటి వరకు సంపాదించుకోవచ్చు. కానీ మీరు దీర్ఘకాలం పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఎలా అనేది చూద్దాం.
మీరు నెలకు రూ.2 వేలు సిప్ రూపంలో పెట్టుబడి పెడితే వార్షిక రిటర్న్ సుమారుగా 12 శాతం వచ్చిందనుకుందాం. మీరు ఇలా 33 సంవత్సరాల పాటు సిప్ కొనసాగిస్తే మీరు జమ చేసిన మొత్తం రూ.7,92,000 అవుతుంది.
12 శాతం వార్షిక వడ్డీ, చక్రవడ్డీ లెక్కిస్తే మీరు రూ.కోటి వరకు ఆదాయం పొందవచ్చు. మీరు ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల చక్రవడ్డీ కలిసి మీ డబ్బులు డబుల్ అవుతాయి. మీరు జమ చేసే సొమ్ము చిన్నదైనా భారీగా పెరుగుతూ ఉంటుంది.
నెలకు రూ.2 వేలు 27 సంవత్సరాలు పెట్టుబడి పెట్టారనుకుందాం. మీరు జమ చేసిన మొత్తం రూ.6,48,000 అవుతుంది. మీకు 15 శాతం వార్షిక రిటర్న్స్, చక్రవడ్డీ ప్రభావం వల్ల రూ.కోటి వరకు ఆదాయం లభిస్తుంది.
12 శాతం రిటర్న్స్ చొప్పున అయితే మీరు కోటి సంపాదించడానికి 33 ఏళ్లు పడుతుంది. అదే 15 శాతం రిటర్న్స్ వస్తే 27 ఏళ్లల్లోనే కోటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
అయితే మీ జీతం, ఆదాయం పెరిగే కొద్ది మీరు సిప్‌లో ఎక్కువ నగదు జమ చేయవచ్చు. దీని వల్ల తక్కువ ఏళ్లల్లోనే మీ ఆదాయం రూ.కోటికి చేరుతుంది. తక్కువ మొత్తంలో పొదుపు చేసుకుని కోటీశ్వరులు అవ్వొచ్చు.
రూ.2 వేలతో మీరు సిప్ ప్రారంభించినా.. ప్రతీ ఏడాది 10 శాతం చొప్పున పెట్టుబడి పెంచుకుంటూ పోవాలి. ఇలాంటి సమయంలో 12 శాతం రిటర్న్స్ మీకు వచ్చినా 24 ఏళ్లల్లోనే కోటీశ్వరులు అవుతారు.
మ్యూచువల్ ఫండ్స్ కాస్త రిస్క్‌తో కూడుకున్నవి. స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులను బట్టి మీ ఫండ్ ప్రభావితం అవుతుంది. దీంతో మంచి ఫండ్ ఎంచుకోండి.
గత కొన్నేళ్లుగా ఆ మ్యూచువల్ ఫండ్ ఎలా ఫర్ఫామ్ చేసింది.. గత 10 ఏళ్లల్లో ఎంత ఆదాయం వచ్చింది? అనే విషయాలు అంచనా వేసుకోండి. గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్స్ చేయవద్దు. నిపుణుల సలహాలు తీసుకోండి.