Voter Name Check: మీ ఓటు ఉందా..? గల్లంతైందా..? సెకన్లలోనే తెలుసుకోండిలా.. మొబైల్లో ఈ చిన్న మెస్సేజ్ పంపితే చాలు..
ఎస్ఐఆర్ జరుగుతుండటం, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఓటు హక్కుకు మళ్లీ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో చాలామంది తమ ఓటు ఉందా.. లేదా అనేది తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తున్నారు. మీరు ఒక్క మెస్సేజ్‌తో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ చూద్దాం.

ఓటు అనేది ప్రతీఒక్కరికీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అనేది మనందరికీ తెలిసిందే. ఓటు హక్కు కలిగి ఉండటం ప్రతీఒక్కరి ప్రాథమిక బాధ్యత. లోక్ సభ ఎన్నికల నుంచి సర్పంచ్ ఎన్నికల వరకు.. మీరు ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఓటు హక్కు కలిగి ఉండాలి. మీరు ఓటర్‌గా నమోదై ఉండకపోతే.. ఎన్నికల్లో మీ ఓటు హక్కును కోల్పోయినట్లే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉండటం, తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించడం, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఓటు హక్కుకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా.. లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. జస్ట్ మీ మొబైల్ నుంచి ఒక్క ఎస్ఎంఎస్ పంపితే చాలు.. మీ ఓటు ఉందా.. లేదా అనేది తెలుసుకోవచ్చు.
SMS ద్వారా ఓటు ఉందో.. లేదో తెలుసుకోవడం ఎలా..?
మీ ఫోన్లో మెస్సేజ్ బాక్స్ తెరవండి. ESI అని టైప్ చేసి స్పేస్ ఇవ్వాలి.. ఆ తర్వాత మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం 1950 నెంబర్‌కు మెస్సేజ్ పంపిస్తే సరిపోతుంది. మీరు మెస్సేజ్ పంపిన కొన్ని సెకన్లకు మీ మొబైల్‌కు ఎన్నికల సంఘం నుంచి ఒక మెస్సేజ్ వస్తుంది. ఆ మెస్సేజ్‌లో మీ పేరు, పోలింగ్ బూత్, నియోజకవర్గం, ఓటర్ లిస్టులో మీ సీరియల్ నెంబర్ వంటి వివరాలు అందుతాయి. ఈ వివరాలు మీకు అందిస్తే మీ ఓటు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ రిప్లై రాకపోతే మీ బూత్ లెవల్ ఆఫీసర్‌ను సంప్రదించండి. మీ ఓటు ఉందా.. లేదా అనేది వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
వెబ్సైట్ ద్వారా చెక్ చేస్కోండిలా..?
-ఈసీ వెబ్సైట్ https://electoralsearch.eci.gov.in/ ఓపెన్ చేయండి
-ఓటర్ ఐడీ నెంబర్, మీ వివరాలు, మొబైల్ నెంబర్ లాంటి ఏ మార్గాల్లో మీ వివరాలు చెక్ చేసుకోవాలనుకుంటున్నారనేది ఎంచుకోండి
-అనంతరం భాష ఎంచుకోండి
-ఓటర్ ఐడీ ద్వారా అయితే ఓటర్ ఐడీ నెంబర్, డీటైల్స్ ప్రకారం అయితే పేరు, రిలేటివ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వయస్సు, జెండర్, జిల్లా, నియోజకవర్గం వివరాలు ఎంటర్ చేయాలి. మొబైల్ ద్వారా అయితే మీ నెంబర్ నమోదు చేయాలి
-అనంతరం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
-ఆ తర్వాత మీ వివరాలు స్క్రీన్‌పై కనిస్తాయి. మీ వివరాలు రాకపోతే బీఎల్ఓను సంప్రదించండి.
