AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie Franchise: సిరీస్‌లు కాదు సినిమాలే.. పెరుగుతున్న ఫ్రాంచైజీలు..!

Movie Franchise: సిరీస్‌లు కాదు సినిమాలే.. పెరుగుతున్న ఫ్రాంచైజీలు..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 16, 2026 | 6:56 PM

Share

ఒక్క సినిమా హిట్‌ అయితే దానికి సీక్వెల్స్‌ తీసుకొచ్చే ట్రెండ్‌ ఇండియన్‌ సినిమాలో పెరుగుతోంది. ‘జైలర్‌ 3’, ‘దృశ్యం 4’, ‘కాంతార 3’, ‘పుష్ప 3’, ‘కేజీఎఫ్‌ 3’ వంటి ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కొన్ని సినిమాల కొనసాగింపుపై దర్శకులు సంకేతాలు ఇవ్వగా, మరికొన్నింటి పనులు ఎప్పుడు మొదలవుతాయన్నది ఇంకా స్పష్టత లేదు. దీంతో స్టార్‌ హీరోల ఫ్రాంచైజీల తదుపరి భాగాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లకే సీజన్ల మీద సీజన్లు రావడం చూశాం కానీ, ఇప్పుడు సినిమాల్లోనూ అదే ట్రెండ్ మొదలైందా..? ఒక్కసారి కథ హిట్టైతే చాలు పార్ట్ 3, పార్ట్ 4 అంటూ మన స్టార్ డైరెక్టర్లు ఫ్రాంచైజీల మీద ఫ్రాంచైజీలు ప్లాన్ చేస్తున్నారా..? ఒక్కసారి మొదలైతే ఆపేదే లేదంటున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో, ఏయే సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయో చూద్దామా..? సాధారణంగా ఓటీటీలో వెబ్ సిరీస్‌లకు మాత్రమే కంటిన్యూగా సీజన్స్ వస్తుంటాయి.. కానీ మన దర్శకులు సినిమాలను కూడా ఫ్రాంచైజీలుగా మార్చేస్తున్నారు. కేవలం రెండో భాగంతో సరిపెట్టకుండా ఏకంగా మూడు, నాలుగు పార్ట్స్‌కు సరిపడా కథలు రాస్తున్నారు. తాజాగా విడుదలైన జైలర్ 2 క్లైమాక్స్‌లో విజయ్ సేతుపతి ఎంట్రీతో జైలర్ 3 కూడా రాబోతోందని దర్శకుడు నెల్సన్ అదిరిపోయే హింట్ ఇచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దృశ్యం ఫ్రాంచైజీలో నాలుగో భాగం ఉంటుందని ఇప్పటికే దర్శకుడు జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చేశారు. హిందీలో ఈ కథకు ముగించినా మలయాళంలో మాత్రం దృశ్యం 4 కంటిన్యూ కానుంది. కాంతార ఫ్రాంచైజీలోనూ పార్ట్ 3 ఉంటుందని, ఇప్పటికే ఆ కథ రాసే పనిలో ఉన్నామని నటుడు కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి స్వయంగా వెల్లడించారు. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పుష్ప, కేజీయఫ్ చిత్రాలకు కూడా పార్ట్ 3 ఉంటుందని ఆయా దర్శకులు ఎప్పుడో ప్రకటించారు. ప్రస్తుతం వాళ్ళు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పుష్ప 3, కేజీయఫ్ 3 సెట్స్ మీదకు ఎప్పుడెళ్తాయో తెలియకపోయినా.. కచ్చితంగా వస్తాయనే నమ్మకమైతే ఫ్యాన్స్‌లో ఉంది. మొత్తానికి ఒక్కసారి కథ మొదలెడితే ఆపేదే లేదంటున్నారు డైరెక్టర్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు రద్దయినా, ఆలస్యమైనా.. పూర్తి డబ్బులు రిఫండ్.. రైల్వే నిబంధనలు ఇవే!

Bigg Boss Telugu 10: ప్రేమే ఆమెకు శాపంగా.. డేంజర్‌ జోన్‌లో లవ్ బర్డ్‌…!

దేశం వదిలిపోవాలంటూ.. బాలీవుడ్ హీరోకు నోటీసులు

The Raja Saab: రాజాసాబే కాదు.. ఈయన చెప్పిన రీజనూ ఫెయిలే

Salman Khan: మళ్లీ అదే చెత్త ప్రశ్న.. కరణ్ దెబ్బకు షాకైన సల్మాన్

Follow Us