AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్..! ఈ స్టేషన్లలో హాల్టింగ్..

వందే భారత్ స్లీపర్ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఏపీ మీదుగా ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఈ నెలలోనే పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో రెండో వందే భారత్ స్లీపర్ రైలుగా ఇది నిలవనుంది. ఇప్పటికే ఈ రైలు నడిపేందుకు ఆమోదం తెలిపారు.

Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్..! ఈ స్టేషన్లలో హాల్టింగ్..
Vande Bharat Sleeper
Venkatrao Lella
|

Updated on: Oct 17, 2026 | 9:46 AM

Share

వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు భారీ శుభవార్త అందింది. దేశంలో తొలి ట్రైన్‌ను ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ ప్రారంభించగా.. హౌరా-గువహతి మధ్య ఇది సర్వీసులు అందిస్తోంది. విమానం తరహాలోనే లగ్జరీ సదుపాయాలు ఇందులో ఉండగా.. రాత్రిపూట ప్రయాణించేవారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. దశలవారీగా మరిన్ని వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. అందులో భాగంగా ఏపీ ప్రజలకు తీపికబురు అందింది. ఏపీలో ఇప్పటికే వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తుండగా.. స్లీపర్ వెర్షన్ లేదు. ఇప్పుడు ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంది. దసరా సందర్భంగా ఈ నెలలోనే ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. దసరా తర్వాత పట్టాలెక్కించనన్నారని సమాచారం.

ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్..

బెంగళూరు-ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించేందుకు ఇప్పటికే రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) మధ్య ఈ ట్రైన్ నడపనున్నారు. ఈ రైలు ఏపీ మీదుగా రాకపోకలు సాగించనుంది. ఏపీలోని ధర్మవరం, అనంతపురం, గుంతకల్ రైల్వే స్టేషన్లలో ఆగనుంది. దీంతో ఏపీ ప్రజలకు కూడా వందే భారత్ స్లీపర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఈ రైలు రాయచూర్, వాడి, కలబురిగి, సోలాపూర్, పూణె, కళ్యాన్ స్టేషన్లలో ఆగనుంది. ముంబై-బెంగళూరు మధ్య ప్రయాణ సమయాన్ని ఇది భారీగా తగ్గించనుంది. ప్రస్తుతం 20 గంటల పాటు పాడుతుండగా.. ఇది 16 గంటలకు తగ్గించనుంది. మొత్తం ముంబై-బెంగళూరు మధ్య 1118 కిలోమీటర్ల దూరాన్ని ఈ వందే భారత్ స్లీపర్ రైలు కవర్ చేయనుంది.

టైమింగ్స్ ఇవే..

బెంగళూరులో రాత్రి 7.50 గంటలకు బయల్దేరనున్న ఈ రైలు.. మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ముంబైలో రాత్రి 8:10 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు బెంగళూరు చేరుకుంటుందని తెలుస్తోంది. ఈ టైమ్ షెడ్యూల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. కేవలం రైల్వేశాఖ ఈ టైమింగ్స్ ప్రతిపాదించింది. ఏపీ నుంచి బెంగళూరు, ముంబై వెళ్లేవారికి ఈ రైలు ప్రయోజనకరంగా ఉండనుంది. ఏపీలోని వివిధ నగరాల మధ్య పర్యటించేవారికి కూడా వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ రైల్లో ఫ్లైట్‌లో ఉన్నట్లుగానే లగ్జరీగా సౌకర్యాలు ఉంటాయి. సీసీ కెమెరాలు, ఆటోమేటెడ్ సెన్సార్ డోర్‌లు, ప్రత్యేక మరుగుదొడ్లు, యూఎస్‌బీ ఛార్జింగ్, క్రాష్ ప్రూఫీ కోచ్ డిజైన్, కవచ్ వ్యవస్థ, అత్యవసర టాక్ బ్యాక్ యూనిట్లు వంటివి ఉంటాయి. ముంబై-బెంగళూరు మధ్య టికెట్ ధర రూ.3 వేలుగా ఉంటుందని తెలుస్తోంది. ఛార్జీల వివరాలను త్వరలో రైల్వేశాఖ విడుదల చేయనుంది.

Follow Us