భయం భయం.. చిన్న సినిమాలకు అదే ఆయుధం
తెలుగు తెరపై కొత్త కాన్సెప్ట్‌లతో హారర్, సైకలాజికల్ థ్రిల్లర్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తున్న ‘418’లో 15 ఏళ్లుగా మూతపడిన మెడికల్ కాలేజీ గది చుట్టూ రహస్యాలు తిరుగుతాయి. కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న ‘హతః’ నవంబర్ 6న విడుదల కానుంది. ఇక షామ్‌దత్ సైనూద్దీన్ తెరకెక్కించిన ‘డోంట్ స్లీప్’ నిద్రకు, మరణానికి మధ్య సంబంధం అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతోంది.
చిన్న సినిమాలే కానీ బలమైన కంటెంట్‌తో వస్తున్న సినిమాలు. కొత్త వాళ్లే అయినా.. హార్రర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్స్ ఆడియన్స్‌ను భయపెట్టడానికి వచ్చేస్తున్నారు. ప్రశాంత్ నీల్, కిరణ్ అబ్బవరం లాంటి సెలబ్రిటీస్‌ల సపోర్ట్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలన్నీ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. మరి ఆ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ ఏంటి.. వాటి వెనుక వింత కాన్సెప్ట్స్ ఏంటో చూద్దామా..? ఈ ట్రైలర్ కొన్ని రోజులుగా యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తున్న ‘418’ సినిమా పక్కా హార్రర్ థ్రిల్లర్‌గా అక్టోబర్ 23న రానుంది. దెయ్యం పట్టిన ఓ గ్రామంలోని మెడికల్ కాలేజీ, అందులో 15 ఏళ్లుగా మూతపడి ఉన్న బిల్డింగ్‌లోని రూమ్ నంబర్ 418 చుట్టూ జరిగే రహస్యాలు, విచిత్రమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. కిరణ్ అబ్బవరం నిర్మాతగా ‘హత:’ అనే డిఫరెంట్ సినిమా ఆడియన్స్‌ను థ్రిల్ చేయడానికి వచ్చేస్తుంది. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో ఆసక్తికరంగా అనూష్ గోరక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌లను ఎంకరేజ్ చేస్తూ కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ షామ్ దత్ సైనూద్దీన్ తెరకెక్కిస్తున్న ‘డోంట్ స్లీప్’ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. నిద్ర ఎక్కువగా పోతే చనిపోతారనే వింత కాన్సెప్ట్‌తో.. కలకు, రియాలిటీకి మధ్య జరిగే ఈ మైండ్ గేమ్ పోరాటం ఆడియన్స్‌కు ఒక సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమాలన్నీ చిన్నవే అయినా.. కాన్సెప్ట్స్ మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు రద్దయినా, ఆలస్యమైనా.. పూర్తి డబ్బులు రిఫండ్.. రైల్వే నిబంధనలు ఇవే!
Bigg Boss Telugu 10: ప్రేమే ఆమెకు శాపంగా.. డేంజర్ జోన్లో లవ్ బర్డ్…!
దేశం వదిలిపోవాలంటూ.. బాలీవుడ్ హీరోకు నోటీసులు
The Raja Saab: రాజాసాబే కాదు.. ఈయన చెప్పిన రీజనూ ఫెయిలే
Salman Khan: మళ్లీ అదే చెత్త ప్రశ్న.. కరణ్ దెబ్బకు షాకైన సల్మాన్
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

