Telangana: త్వరలో అక్కడ ఐటీ టవర్స్.. శుభవార్త చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు
హనుమకొండ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త అందించారు. హన్మకొండలో ఐటీ టవర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా హనుమకొండలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ యువకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.

ఫిట్నెస్పై అవగాహన కల్పించడంతో పాటు మత్తుకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ హనుమకొండలో నిర్వహించిన మారథాన్లో ఓరుగల్లు ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. నాయిని విశాల్ ట్రస్ట్ చైర్మన్ MLA నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ మారథాన్లో మంత్రి శ్రీధర్ బాబు, పలువురు MLAలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. యువతతో కలిసి రన్నింగ్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు.. బాలసముద్రంలో ఓ టీస్టాల్ వద్ద ఆగి సరదాగా గడిపారు. టీ తాగుతూ సెల్ఫీలు దిగి సండి చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఓరుగల్లు ప్రజలకు శుభవార్త తెలిపారు. త్వరలో హనుమకొండలో IT టవర్స్ నిర్మిస్తామని ప్రకటించారు.
హనుమకొండ హాఫ్ మారథాన్ రన్తో సందడిగా మారింది. హయగ్రీవచారి మైదానం నుండి 5 కి,మీ, 10 కి.మీ, 21 కి.మీ మారథాన్ రన్ నిర్వహించారు. వరంగల్ పచ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి తన తనయుడు విశాల్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మారథాన్ లో వేలాదిమంది యువత, విద్యావంతులు, ఉద్యోగులు, వైద్యులు, క్రీడాకారులు, వికలాంగులు కూడా పాల్గొన్నారు. హయగ్రీవచారి మైదానం లో మారథాన్ రన్ ను మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతకు చక్కటి సందేశం ఇచ్చిన మంత్రి.. ఓరుగల్లు ప్రజలకు తీపి కబురు చెప్పారు. త్వరలో హనుమకొండలో IT టవర్స్ నిర్మిస్తామని ప్రకటించారు
అనంతరం హనుమకొండలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్థానిక టీ దుకాణం వద్ద ఆగి టీ తాగుతూ సందడి చేశారు.నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఇలా రోడ్డుపక్కన సాధారణ టీ స్టాల్ వద్ద కనిపించడంతో ఆ దృశ్యం ఆసక్తిని రేకెత్తించింది. హాఫ్ మారథాన్ ఉత్సాహం మధ్య టీ కప్పుతో కాసేపు సరదాగా గడిపిన నేతల దృశ్యం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది
