భర్త ఆస్తిలో భార్య, కుమార్తెకు సమాన హక్కులు ఉంటాయా..?
Venkatrao Lella
Images: Pinterest
17 OCT 2026
భర్త ఆస్తిపై భార్య, కుమార్తె ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే కొంత సంక్లిష్టంగానే ఉంటుంది. భారత ఆస్తి చట్టాలను క్షణ్నంగా పరిశీలిస్తే దీనికి సమాధానం లభిస్తుంది.
హిందూ వారసత్వ చట్టం1957లోని సెక్షన్ 6కు 2005లో చేసిన సవరణ ప్రకారం కుమార్తెను కూడా సహ వారసులుగా పరిగణిస్తారు. దీంతో తండ్రి ఆస్తిలో కుమారుడితో సమానమైన హక్కులు కలిగి ఉంటారు. ఇక భార్యకు ఉండే హక్కుల గురించి తెలుసుకుందాం.
భర్త ఆస్తిలో భార్య, కుమార్తెలకు వాటా లభిస్తుందా..? అనేది ఆస్తి రకంపై ఆధారపడి ఉంటుంది. పూర్వీకుల నుంచి వచ్చి ఆస్తి అయితే నిబంధనలు ఒకలా.. భర్త తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి అయితే మరోలా రూల్స్ ఉంటాయి.
1965 హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. తాను సంపాదించిన ఆస్తిపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయి. వీటిని వీలునామా ద్వారా భార్య, కుమార్తె లేదా కుమారుడికి ఇవ్వొచ్చు. దీంతో ఆ ఆస్తి యజమాని మరణాంతరం ఎవరికి అయితే వీల్లు ద్వారా అందించారో.. వారికే లభిస్తుంది.
వీలునామా రాయకుండా మరణిస్తే.. ఆస్తి చట్టంలోని సెక్షన్ 8,10 ప్రకారం వారసత్వాన్ని నిర్ధారిస్తారు. ముందుగా వారసులు క్లాస్ 1లో ఉంటారు. అంటే భార్య, కుమారుడు, కుమార్తె, తల్లికి యజమాని ఆస్తిలో తొలి ప్రాధాన్యత ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తిని నలుగురికి సమానంగా విభజిస్తారు. ఉదాహరణకు ఆస్తి విలువ రూ.60 లక్షలు అనుకుంటే.. ఒక్కొక్కరికీ రూ.15 లక్షల చొప్పున దక్కుతుంది. పరిస్థితుల్లో భార్య, కుమార్తెకు సమాన హక్కులు ఉంటాయి
పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయితే కుమారుడు, కుమార్తెకు సమాన హక్కులు ఉంటాయి. కూతురికి పెళ్లి అయినా కూడా ఆస్తిపై హక్కు ఉంటుంది. దీంతో తండ్రి మరణిస్తే.. కుమారుడు, కుమార్తెకు సమాన వాటా దక్కుతుంది.
కేవలం తన కుమారుడికి మాత్రమే తండ్రి ఆస్తి మొత్తాన్ని ఇవ్వాలనుకుంటే.. కూతురి నుంచి అంగీకారం పత్రం తీసుకోవాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. లేకపోతే కుమార్తె కూడా వాటా అడిగే హక్కు ఉంటుంది.
భర్త ఆస్తిలో భార్య, కుమార్తెకు వాటా దక్కుతుందనేది ఆస్తి రకంను బట్టి అర్థం చేసుకోవాలి. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిపై హక్కు ఒకలా.. భర్త సొంతగా సంపాదించిన ఆస్తిపై హక్కు మరోలా ఉంటుంది.