AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్‌ రేట్ల పై బంపర్ ఆఫర్

Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్‌ రేట్ల పై బంపర్ ఆఫర్

Phani CH
|

Updated on: Mar 24, 2026 | 8:05 PM

Share

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా టికెట్ ధరలు మార్చి 23 నుండి ఏపీలో తగ్గాయి. తొలి 10 రోజుల పెరిగిన ధరల అనుమతి తొలగించి, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ₹100, మల్టీప్లెక్స్‌లు ₹125. ఈ తగ్గింపుతో ఎక్కువ మంది ఆడియన్స్ థియేటర్లకు వచ్చి, కలెక్షన్లు పెరుగుతాయని మైత్రీ మూవీ మేకర్స్ ఆశిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్‌ కు గుడ్ న్యూస్. ఏపీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టికెట్ ధరలు రాష్ట్రంలో ఇవాల్టి నుంచి అంటే.. మార్చి23 నుంచి తగ్గనున్నాయి. దీంతో మెగా ఫ్యాన్సే కాదు.. మూవీ లవర్స్‌ కూడా ఖుషీ అవుతున్నారు.తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉగాదికి రిలీజైన ఉస్తాద్ మూవీకి 10రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోటానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. మొదటి 10 రోజుల కోసం అనుమతించిన అదనపు పెంపును తాజాగా తొలగించిన మేకర్స్.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. తెలంగాణలో అందుబాటులో ఉన్న ధరలతో సమానంగా.. ఏపీలోని ఉస్తాద్ టికెట్ ధరలను చేరుకున్నాయి. అంతేకాదు తగ్గించిన తర్వాత ఉస్తాద్ టికెట్ ధరలు..సింగిల్ స్క్రీన్స్ 100 రూపాయలకు.. మల్టీప్లెక్స్ లలో రూ. 125 లకు తగ్గనున్నాయి. టికెట్ రేట్స్‌ తగ్గించడంతో.. థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. కలెక్షన్స్ కూడా పెరిగుతాయని మైత్రీ మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటించారు. తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ విలన్ గా మెప్పించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ‌ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. అలాగే తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా మంచి టాక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ స్టైల్ యాక్షన్, మాస్, ఎలిమింట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??

తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం

ఎవడ్రా వీడు.. మటన్‌ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..

బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..

PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి

Follow Us