AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??

వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??

Phani CH
|

Updated on: Mar 24, 2026 | 5:02 PM

Share

మధ్యప్రాచ్య యుద్ధాల కారణంగా హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరిగి భారతదేశంలో LPG కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు, ప్రభుత్వ చమురు సంస్థలు 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించి పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నాయి. దీనివల్ల ఉన్న గ్యాస్‌ను ఎక్కువ మంది వినియోగదారులకు చేర్చవచ్చు, అయితే దీనికి అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.

భారతదేశంలో గ్యాస్‌ కొరత పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. గ్యాస్ దిగుమతులకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఒక వినూత్న వ్యూహాన్ని పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2 కిలోల సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించాలని యోచిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశం తన అవసరాల కోసం రోజుకు సుమారు 93,500 టన్నుల ఎల్పీజీని వినియోగిస్తోంది. ఇందులో మెజారిటీ వాటా గృహ వినియోగదారులదే. ప్రస్తుతం అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగడంతో, ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడమే లక్ష్యంగా కంపెనీలు ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. 14.2 కిలోల సిలిండర్ సగటున 40 రోజులు వస్తే, 10 కిలోల సిలిండర్ నెల రోజులు వస్తుందని అంచనా. దీనివల్ల తక్కువ గ్యాస్‌తో ఎక్కువ మంది వినియోగదారులకు సేవలు అందించవచ్చని భావిస్తున్నారు. పాత సిలిండర్లలోనే మార్పు: కొత్త సిలిండర్లు తయారు చేసే కంటే, ప్రస్తుతం ఉన్న వాటిలోనే 10 కిలోల గ్యాస్‌ను నింపి పంపిణీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. బరువు తగ్గినప్పుడు దానికి అనుగుణంగా ధరను కూడా తగ్గించాల్సి ఉంటుంది. అలాగే సిలిండర్‌పై బరువు వివరాలను స్పష్టంగా లేబుల్ చేయాలి. ఈ మార్పులు చేయాలంటే రీఫిల్లింగ్ ప్లాంట్లలో సాంకేతిక మార్పులతో పాటు రెగ్యులేటరీ సంస్థల నుంచి అనుమతులు తప్పనిసరి. అయితే ప్రభుత్వం నుంచి గానీ, చమురు సంస్థల నుంచి గానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే గ్యాస్ పంపిణీలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం

ఎవడ్రా వీడు.. మటన్‌ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..

బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..

PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి

Weather Update: వచ్చే 3 రోజులూ వానలే.. చల్ల చల్లని.. కూల్ కూల్

Follow Us