AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..

బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..

Phani CH
|

Updated on: Mar 24, 2026 | 4:49 PM

Share

టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా, క్యాబిన్ సిబ్బంది ఫిట్‌నెస్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. నిర్దేశిత బరువు, BMI ప్రమాణాలను పాటించని వారికి జీతాల్లో కోత, విధులకు దూరం వంటి చర్యలు తీసుకోనుంది. సంస్థ ప్రతిష్ట, అత్యవసర పరిస్థితుల్లో సమర్థత కోసం ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.

టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా సంస్థ తన క్యాబిన్ సిబ్బంది ఫిట్‌నెస్ విషయంలో ముఖ్య నిర్ణయం తీసుకుంది. నిర్దేశించిన బరువు కంటే ఎక్కువగా ఉన్న సిబ్బందిని విధులకు దూరం పెట్టడంతో పాటు వారి జీతాల్లో కోత విధించాలని యోచిస్తోంది. సంస్థ ప్రతిష్టను, సేవల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను కఠినతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, సిబ్బంది బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)ని క్రమం తప్పకుండా చెక్‌ చేస్తారు. ఎవరైనా నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ బరువు ఉన్నట్లు తేలితే, వారిని ‘అన్‌ఫిట్’గా పరిగణిస్తారు. బరువు తగ్గేందుకు వారికి కొంత గడువు ఇచ్చిన తర్వాత కూడా మార్పు లేకపోతే విమాన విధుల నుంచి తప్పించి గ్రౌండ్ స్టాఫ్‌గా పంపించడం లేదా జీతంలో కోత విధించడం వంటి యాక్షన్‌ తీసుకోనున్నారు. కేవలం బాహ్య సౌందర్యం కోసమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది చురుగ్గా, సమర్థంగా స్పందించేందుకు శారీరక దృఢత్వం చాలా అవసరమని యాజమాన్యం భావిస్తోంది. టాటా గ్రూప్ చేతికి వచ్చాక ఎయిర్ ఇండియా బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయిలో మెరుగుపరిచేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగానే ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై క్యాబిన్ క్రూ యూనియన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కేవలం బరువు ఆధారంగా జీతంలో కోతలు విధించడం సరికాదని, ఉద్యోగుల వయసు, ఇతర ఆరోగ్య సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు వాదిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి

Weather Update: వచ్చే 3 రోజులూ వానలే.. చల్ల చల్లని.. కూల్ కూల్

Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. మరీ దారుణంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

సముద్రంలో ఇంటర్నెట్‌ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!

అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..

Follow Us