AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టిపరిస్థితుల్లోనూ ChatGPTతో మీ పర్సనల్ విషయాలు చెప్పకండి.. హద్దుదాటారో అంతే సంగతి!

ప్రస్తుతం యువత జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆఫీస్‌లో బాస్‌తో గొడవ వచ్చినా, జీతం పెంచమని ఎలా అడగాలో తెలియకపోయినా, వ్యక్తిగత సంబంధాల్లో సమస్యలు వచ్చినా… వెంటనే చాలామంది ఆశ్రయిస్తున్నది ‘చాట్ జీపీటీ’నే. రోజుకు కోట్ల సంఖ్యలో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఈ AI చాట్‌బాట్ వేగంగా ప్రజల్లోకి చేరిపోయింది. అంచనాల ప్రకారం రోజుకు దాదాపు 250 కోట్ల ప్రశ్నలకు స్పందిస్తోంది..

ఎట్టిపరిస్థితుల్లోనూ ChatGPTతో మీ పర్సనల్ విషయాలు చెప్పకండి.. హద్దుదాటారో అంతే సంగతి!
Never Share these Things with ChatGPT
Vijay Saatha
| Edited By: |

Updated on: Mar 25, 2026 | 12:37 PM

Share

ChatGPT టెక్నాలజీని ఎంత ఉపయోగకరంగా వాడుకోవాలో తెలిసినంతగా, దాని పరిమితులు కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా వ్యక్తిగత, సున్నితమైన సమాచారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఆధార్ లేదా పాన్ వంటి గుర్తింపు డేటా, ఆఫీస్‌కు సంబంధించిన రహస్య పత్రాలు వంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చాట్‌బాట్‌లో టైప్ చేయకూడదు. ఒకసారి మీరు ఈ వివరాలను షేర్ చేస్తే అవి మీ నియంత్రణలో ఉండవు. అందుకే, మీకు అత్యంత ప్రైవేట్‌గా ఉండాల్సిన సమాచారాన్ని ఎప్పుడూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించడం మంచిది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చాట్ జీపీటీపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం. కొందరు శారీరక సమస్యలకే కాదు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలకూ దీనిని ఆశ్రయిస్తున్నారు.

అయితే ఇది ఒక ప్రొఫెషనల్ డాక్టర్ లేదా థెరపిస్ట్‌కు ప్రత్యామ్నాయం కాదు. సాధారణ సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. కానీ, చికిత్స లేదా మందుల విషయాల్లో తప్పకుండా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలి. ఇక చట్టవిరుద్ధమైన లేదా ప్రమాదకరమైన విషయాలపై సెర్చ్ చేయడం కూడా పెద్ద ప్రమాదమే. బాంబులు తయారు చేయడం, హ్యాకింగ్ పద్ధతులు, నేరాలు చేసి తప్పించుకోవడం వంటి అంశాలపై సమాచారం కోసం వెతకడం కేవలం తప్పు మాత్రమే కాదు, అది మీపై అనుమానాలు కలిగించే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ప్రశ్నలను టెక్నాలజీ కంపెనీలు గమనించే అవకాశముంది. కాబట్టి, సరదాగా అయినా ఇలాంటి విషయాలపై సెర్చ్ చేయకుండా ఉండటం మంచిది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాట్ జీపీటీ ఇచ్చే ప్రతి సమాచారం నిజమే అనుకోవడం కూడా తప్పు. కొన్ని సందర్భాల్లో ఇది తప్పుడు లేదా అసంపూర్ణ సమాచారం ఇవ్వవచ్చు. ముఖ్యంగా కుట్ర సిద్ధాంతాలు, నిర్ధారణలేని వార్తలు వంటి వాటిని ఇది నిజాల్లాగా ప్రదర్శించే అవకాశం ఉంది. అందువల్ల, ఏ విషయాన్నైనా నమ్మే ముందు ఇతర విశ్వసనీయ వనరులతో ధృవీకరించడం చాలా అవసరం. ఇంకా ముఖ్యంగా జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలను AIకి వదిలేయడం ప్రమాదకరం. ఉద్యోగం మారాలా, పెళ్లి చేసుకోవాలా, సంబంధాలను కొనసాగించాలా లేదా ముగించాలా వంటి విషయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. ఇవి భావోద్వేగాలు, అనుభవాలు, పరిస్థితులపై ఆధారపడతాయి. చాట్‌బాట్ ఇచ్చే సమాధానాలు సాధారణంగా వినిపించవచ్చు కానీ, మీ వ్యక్తిగత జీవితానికి సరిపోకపోవచ్చు.

ఇవి కూడా చదవండి

మొత్తానికి టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేయడానికి ఉపయోగపడాలి కానీ, మన నిర్ణయాలను నియంత్రించడానికి కాదు. చాట్ జీపీటీ వంటి టూల్స్‌ను జాగ్రత్తగా, తెలివిగా వాడుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. అయితే, మన సీక్రెట్స్‌ను కాపాడుకోవడం, ఆరోగ్య విషయాల్లో నిపుణులను సంప్రదించడం, నిజానిజాలను తెలుసుకోవడం, ముఖ్యమైన నిర్ణయాలను మనమే తీసుకోవడం చాలా అవసరం. టెక్నాలజీకి బానిస కాకుండా, దాన్ని మనకు సహాయకంగా మార్చుకోవడమే తెలివైన నిర్ణయం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us