AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa : నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.. శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్..

మోనాలిసా భోంస్లే.. మొదటి నుంచి సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. గత ఏడాది ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ నీలికళ్ల అందం.. ఆ తర్వాత కథానాయికగా వరుస అవకాశాలు అందుకుంది. సినీరంగంలోకి అడుగుపెట్టిన తర్వాత మోనాలిసా పేరు నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు తన ప్రియుడిని పెళ్లి చేసుకుని మరోసారి వార్తలలో నిలిచింది. తాజాగా తన భర్తతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

Monalisa : నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.. శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్..
Monalisa
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2026 | 10:42 AM

Share

గత ఏడాది ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా ఒక్కసారిగా నెట్టింట పాపులర్ అయ్యింది మోనాలిసా. ఆమె సహజ సౌందర్యం, నీలి కళ్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఆమె జీవితం వార్తలలో నిలిచింది. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ కోసం కుటుంబాన్ని ఎదురించి కేరళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కేరళలోని తిరువనంతపురంలోని హిందూ సంప్రదాయం ప్రకారం తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. అయితే మోనాలిసా వివాహం పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా లవ్ జిహాద్ అంటూ ఆరోపణలు చేశారు. మరోవైపు మోనాలిసా పెళ్లి పై ఆమె బంధువు విజయ్ భోస్లే మాట్లాడుతూ మోనాలిసా మైనర్ అని.. ఈ పెళ్లి చట్టబద్ధం కాదని అన్నారు. అయితే తమ వివాహం గురించి వస్తున్న ఆరోపణలపై మోనాలిసా దంపతులు మాట్లాడుతూ.. తాము చట్టబద్ధంగానే వివాహం చేసుకున్నామని.. ఎవరి మతాలను వారు అనుసరిస్తామని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. అందుకు కారణం ఆ ఒక్కటే.. శ్రీకాంత్..

తాజాగా తన భర్తతో కలిసి మోనాలిసా కొచ్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు సనోజ్ మిశ్రా పై సంచలన ఆరోపణలు చేసింది. తనకు తెలిసిన ఒక సినీ దర్శకుడు సినిమాల పేరుతో మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తనకు, తన భర్తకు ప్రాణ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోరింది. దర్శకుడు తన గురించి చెడుగా మాట్లాడుతున్నాడని, తన సినిమాల్లో తనకు అవకాశం ఇవ్వడం లేదని కూడా ఆమె ఆరోపించింది. “అతని సినిమాల్లో ఎవరు నటించాలనుకుంటారు? అతను చాలా చెడ్డ, అసహ్యకరమైన వ్యక్తి. సినిమాల పేరుతో మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అతని పేరు పలకడానికే సిగ్గుగా ఉంది. అతడు షూటింగ్ సమయంలో పలుమార్లు శరీర భాగాలను తాకుతూ లైంగికంగా వేధించారు. ఆ చేదు అనుభవం గురించి ఇంట్లో వారికి చెబితే మొదటి సినిమా కదా సర్దుకుపోవాలని చెప్పారని.. ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయానని” అంటూ ఎమోషనల్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..

అతడు తన పెళ్లిని లవ్ జిహాద్ అని అనడానికి కారణం తనపై ఉన్న కక్షకే కారణమని అన్నారు. తన పెళ్లి గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆ దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. మాకు గుడిలో హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగింది. ఆ విషయం దేశంలో అందరికీ తెలుసు. దర్శకుడు తీవ్రవాదం ఉండాలని, ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన మా పెళ్లిని లవ్-జిహాద్ అని పిలుస్తున్నారు. నేను అన్ని మతాలను గౌరవిస్తానని తెలిపింది మోనాలిసా.

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak: అందరు హీరోలతో చేశా.. కానీ నాగార్జునతో సినిమా ఎందుకు చేయాలేదంటే.. అసలు విషయం చెప్పిన వివి వినాయక్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..

Follow Us