AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth : అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. అందుకు కారణం ఆ ఒక్కటే.. శ్రీకాంత్..

ఒకప్పుడు హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగాడు శ్రీకాంత్. అప్పట్లో ఆయనకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం నటుడిగా, విలన్ గా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ సంబరాల ఏటిగట్టు చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు.

Srikanth : అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. అందుకు కారణం ఆ ఒక్కటే.. శ్రీకాంత్..
Srikanth
Rajitha Chanti
|

Updated on: Mar 24, 2026 | 7:05 PM

Share

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా కొనసాగుతున్నారు. అప్పట్లో వరుసగా హీరోగా మెప్పించిన శ్రీకాంత్.. తన సినీ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అలాగే ఎన్నో సార్లు ఇతరులపై నమ్మకంతో చాలా డబ్బు పోగొట్టుకున్నారట. ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ఇదెలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

సినీ నటుడు శ్రీకాంత్ ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో తన కెరీర్‌కు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కొంతమంది ప్రొడ్యూసర్లను నమ్మి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతల విషయంలో సరైన అంచనా వేయకపోవడం వల్ల చాలా డబ్బు పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్ తన సినీ జీవితంలో గుర్తుండిపోయే పాత్రలలో ఒకటైన గోవిందుడు అందరివాడేలే సినిమాలోని క్యారెక్టర్ గురించి వివరంగా మాట్లాడారు. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో తన బాబాయ్ క్యారెక్టర్ చాలా విచిత్రంగా, ఎంటర్టైనింగ్‌గా ఉంటుందని తెలిపారు. ఆ పాత్రలోని డ్రెస్సులు, గోల గోలగా ఉండే దాని స్వభావం చాలా చాలెంజింగ్‌గా, అదే సమయంలో సరదాగా అనిపించిందని ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే కొన్ని ప్రత్యేకమైన వ్యక్తుల స్ఫూర్తితో ఈ పాత్రను డిజైన్ చేశారని, గోడపై ఎక్కి అన్నం పెట్టడం వంటి కొన్ని ఫన్నీ సీన్లు ఉన్నప్పటికీ, అవి కొన్ని ఎడిటింగ్‌లో తొలగించారని వెల్లడించారు. అయినప్పటికీ, సినిమాలో మిగిలిన సన్నివేశాలు, తన పాత్ర చిత్రీకరణ చాలా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులకు బాగా నచ్చిందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఈ పాత్ర తన కెరీర్‌లో లక్కీ క్యారెక్టర్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us