AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్

Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్

Phani CH
|

Updated on: Mar 24, 2026 | 8:20 PM

Share

స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ బయోపిక్‌లో నటించే అవకాశంపై శర్వానంద్ ఆసక్తికరంగా స్పందించారు. రోహిత్ శర్మ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని, తనను చాలా మంది రోహిత్ శర్మను పోలి ఉన్నారని గతంలో అన్నారని శర్వానంద్ గుర్తుచేశారు. ఒకవేళ కథ తన దగ్గరకు వస్తే తప్పకుండా నటిస్తానని బైకర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో స్పష్టం చేశారు. శర్వానంద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడంతా బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్పోర్ట్స్, పాలిటిక్స్ ప్రముఖల జీవితాలను తొంగి చూస్తున్న ఫిల్మ్ మేకర్స్‌.. ఫిల్మ డెలివరీ చేసి.. హిట్టు కొట్టాలని తెగ ఆరాట పడుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్, టాలీవుడ్ మేకర్స్ పోటీపడుతున్నారని.. అందులో ఓ మేకర్‌ రోహిత్ శర్మ క్యారెక్టర్ కోసం శర్వానంద్‌ను ఎంచుకున్నాడని ఓ టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఈ వైరల్ న్యూస్‌ పైనే తాజాగా శర్వా రియాక్టవ్వడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌ గా మారింది. శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్‌ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్‌లో రిపోర్ట్స్ శర్వాను .. రోహిత్ శర్మ బయోపిక్ గురించి అడిగారు. దీంతో శర్వా కూడా కాస్త సానుకూలంగా.. రియాక్టయ్యాడు. రోహిత్ శర్మ బయోపిక్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తన దృష్టికి కూడా వచ్చాయని చెప్పిన శర్వ.. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైనదన్నాడు. ఒకవేళ ఆ కథ తన దగ్గరకు వస్తే మాత్రం తప్పకుండా నటించడానికి సిద్ధమే అంటూ కుండబద్దులు కొట్టినట్టు చెప్పేశాడు. గతంలో రోహిత్ శర్మకు తన లుక్ దగ్గరగా ఉంటుందని చాలా మంది అన్నారని శర్వా గుర్తు చేసుకున్నాడు. అయితే ప్రస్తుతానికి మాత్రం తన దృష్టంతా ఏప్రిల్ 3న విడుదల కానున్న ‘బైకర్’ సినిమాపైనే ఉందని రిపోర్ ప్రశ్నకు బదులిచ్చాడు. దీంతో శర్వానంద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ

భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు

Dhurandhar 2: బన్నీతో దురంధర్ డైరెక్టర్ పాన్ వరల్డ్ ఫిల్మ్

Renu Desai: చాయ్‌వాలాకు నేనో అంధ భక్తురాలిని !! ధురంధర్ 2కు రేణు షాకింగ్ రివ్యూ..

Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్‌ రేట్ల పై బంపర్ ఆఫర్

Follow Us