Dhurandhar 2: బన్నీతో దురంధర్ డైరెక్టర్ పాన్ వరల్డ్ ఫిల్మ్
దేశవ్యాప్తంగా ‘ధురంధర్ 2’ విజయం, రూ. 500 కోట్ల వసూళ్లతో డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మారుమోగుతోంది. ఇప్పుడు అతని తదుపరి చిత్రం ‘అశ్వత్థామ’ పై ఆసక్తి నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారనే వార్తలు సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇది నిజమైతే, బన్నీ, ఎన్టీఆర్ అభిమానులకు పండగే.
ప్రస్తుతం దేశంలో ‘ధురంధర్ 2’ మేనియా గట్టిగానే నడుస్తోంది. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లుతోంది. మొదటి పార్ట్ కు మించి వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. మార్చి 19న రిలీజైన ధురంధర్ ది రివేంజ్ కేవలం 3 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దీంతో డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మరోసారి త్రూ అవుట్ ఇండియా మార్మోగుతోంది. ఉరి తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు ధురందర్, ధురంధర్ రివేంజ్ లతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. ఇప్పుడు ఇతని దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు సైతం క్యూ కడుతున్నారు. ఇక ఈ విషయం పక్కుకు పెడితే.. ‘ధురంధర’ దర్శకుడు ఆదిత్య ధర్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం ‘అశ్వద్ధామ’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఓ ప్రకటన చేశాడు ఆదిత్య ధర్. ఇందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఆదిత్య చర్చలు జరిపాడని ప్రచారం జరిగింది. అయితే దీని తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ధురంధర్ 2 సినిమా ప్రీమియర్ చూసిన అల్లు అర్జున్ సినిమాని కొనియాడుతూ ట్వీట్ చేయడం, ఆదిత్య ధర్ ను ఆకాశానికెత్తేయడం చూస్తుంటే త్వరలో వీరిద్దరూ కలిసి పనిచేస్తారేమోనని సినిమా ఇండస్డ్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ క్రేజీ ప్రాజెక్టులో బన్నీతో పాటు ఎన్టీఆర్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తాడని రూమర్లు వస్తున్నాయి. ఒక వేళ ఇదే నిజమైతే బన్నీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగేనని చెప్పుకోవచ్చు. అలాగే మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Renu Desai: చాయ్‌వాలాకు నేనో అంధ భక్తురాలిని !! ధురంధర్ 2కు రేణు షాకింగ్ రివ్యూ..
Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్ రేట్ల పై బంపర్ ఆఫర్
వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??
తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం
ఎవడ్రా వీడు.. మటన్ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..
బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !

