Baby Elephant birthday: ఎలిఫెంట్ క్యాంప్‌లో బుజ్జి గజరాజుకు ఘనంగా పుట్టిన రోజులు వేడుకలు!
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కమలాపూర్ ఏనుగుల క్యాంప్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఓ గున్న ఏనుగు జన్మించడంతో ఆ పిల్ల ఏనుగు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు అక్కడి అటవిశాఖ అధికారులు. ఈ ఎలిఫెంట్ క్యాంప్ తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత సమీపంలోని గడ్చిరోలి జిల్లా కమలాపూర్ అటవి ప్రాంతంలో ఉంది.

ఈ ఎలిఫెంట్ క్యాంప్ లో 9 ఏనుగులు ఉండగా అజిత్-రాణి ల సంతానమైన కుసుం రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అరటి, ఆపిల్, ద్రాక్ష పండ్లు తీసుకు వచ్చి అందంగా కేకుల్లా తయారు చేశారు. కుసుంతో పాటు మిగిలిన ఏనుగులు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఈ వేడుకల్లో భాగంగా కమలాపూర్ క్యాంప్ లోని ఏనుగులకు ఇష్టమైన ఆహారాన్ని అందించారు. ఏనుగులకు సాంప్రదాయ దుస్తులైనా గమోసా వంటివి కప్పారు.. ఈ వేడుకలు పర్యావరణ పరిరక్షణ, ఏనుగుల సంరక్షణ గురించి అవగాహన పెంచడానికి సహాయపడతాయని మహారాష్ట్ర అటవిశాఖ తెలిపింది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా సరిహద్దుకు సమీపంలోని ప్రాణహిత తీర సమీపంలోని మహారాష్ట్రాలో ఉంది ఈ కమలాపూర్ ఏనుగుల క్యాంపు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుండి 75 కిలో మీటర్ల దూరంలో ఉన్న కమలాపూర్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభయారణ్యం లో ఈ ఏనుగుల క్యాంపు కొనసాగుతోంది.
వేసవి కాలంలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ క్యాంపు. ఇక్కడి ఏనుగులు సైతం పర్యాటకులను అలరిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో, చుట్టూ గుట్టలు, చెరువుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రాంతం ఉండటంతో తెలంగాణ, మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున పర్యాటలకులు ఈ క్యాంప్ సందర్శనకు క్యూ కడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
