Pushpa 2: పుష్ప2 పై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్.. అల్లు ఈజ్ మెగా అంటూ..
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ భారీ అంచనాలతో ఈరోజు (డిసెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం వహించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

పుష్ప .. పుష్ప.. పుష్ప ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే మాట.. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా ట్రెండ్ అవుతుంది. సుకుమార్ దర్శకత్వం వహించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటించింది. సునీల్ , ఫహద్ ఫాజిల్, రావు రమేష్, శ్రీ లీలఎం అనసూయ ఇలా చాలా మంది పుష్ప2లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పై ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రెటీలు కూడా స్పందిస్తున్నారు.
తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పుష్ప 2 సినిమా పై స్పందించారు. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్ కు ఆర్జీవీ అబినందనలు తెలిపారు. ఇండియాలోనే బిగెస్ట్ హిట్.. ఇండస్ట్రీ హిట్ మూవీ అందించిన పుష్ప మూవీ టీమ్ కు, అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపారు ఆర్జీవీ. మాములుగా ట్వీట్ చేస్తే ఆర్జీవీ ఎందుకు అవుతారు. చివరిలో కౌంటర్ ఇచ్చారు ఆర్జీవీ.
అల్లు ఈజ్ మెగా మెగా మెగా.. అంటూ చివరిలో రాసుకొచ్చారు ఆర్జీవీ. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పుష్ప 2 సినిమాలో ఫైట్ సీన్స్, సెంటిమెంట్ సీన్లు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు ప్రేక్షకులు. సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ పనితనం పుష్ప 2ని మరో స్థాయికి ఎలివేట్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక సినిమా చివరిలో 3వ భాగానికి కూడా లీడ్ అద్భుతంగా ఉందని అంటున్నారు ప్రేక్షకులు. ఫహద్ ఫాసిల్ విలన్ గా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు అని తెలుస్తోంది.
CONGRATS to @alluarjun and team for giving a ALL INDIA INDUSTRY HIT .. ALLU is MEGA MEGA MEGA MEGA MEGA
— Ram Gopal Varma (@RGVzoomin) December 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




