మోక్షు హీరోగా ‘ఆదిత్య 369’ సీక్వెల్ అనౌన్స్ చేసిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ నటించిన ఐకానిక్ చిత్రాల్లో ఆదిత్య 369 ఒకటి. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా 1991లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతారు.
ఈ సినిమాను ఇప్పటికీ ఇష్టపడుతుంటారు. అయితే ఈ మూవీ ఫ్యాన్స్‌కు.. ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు బాలయ్య. అది కూడా అన్ స్టాపబుల్ సీజన్ 4 వేదికగా..! ఎస్ ! తాను హోస్టింగ్ చేస్తోన్న అన్ స్టాపబుల్ సీజన్ 4 కార్యక్రమంలో ఈ సినిమా గురించి మాట్లాడారు బాలయ్య. ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999 రానుందని… తన కొడుకు మోక్షజ్ఞ తేజ హీరోగా యాక్ట్ చేయనున్నాడంటూ చెప్పారు ఈయన. అంతేకాదు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరగుతున్నాయని అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన హీరో.. ఏంటీ పిచ్చి నిర్ణయం
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మంచు మనువరాళ్లు.. ఖుషీగా తాత మోహన్ బాబు
TOP 9 ET News: థియేటర్స్‌లో పుష్పగాడి వైల్డ్ ఫైర్ మెంటలెక్కిపోతున్న ఆడియెన్స్
వైరల్ వీడియోలు
Latest Videos