Upasana Konidela: ‘ఆశ్చర్యంగా ఉంది.. ఇంతకు ముందు ఎప్పుడు షేర్ చేయలేదు’.. ఉపాసన పోస్ట్ పై నమ్రత రియాక్షన్..
ఇక మరికొద్ది రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. పెళ్లైన పది సంవత్సరాల తర్వాత ఉపాసన రామ్ చరణ్ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ సందడి వాతావరణం నెలకొంది. మెగా ఫ్యామిలీ మొత్తం చెర్రీ, ఉపాసన బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంట రామ్ చరణ్, ఉపాసన కొణిదెల. ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్గా అభిమానులను సొంతం చేసుకున్నారు చరణ్. ఇక ఆయన సతీమణి ఉపాసనకు సైతం సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఓవైపు చెర్రీకి భార్యగా.. మరోవైపు అపోలో హస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూ వ్యాపారరంగంలోనూ తనదైన ముద్ర వేశారు ఉపాసన. ఇక మరికొద్ది రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. పెళ్లైన పది సంవత్సరాల తర్వాత ఉపాసన రామ్ చరణ్ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ సందడి వాతావరణం నెలకొంది. మెగా ఫ్యామిలీ మొత్తం చెర్రీ, ఉపాసన బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చరణ్ షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని సతీమణి.. ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నారు. ఇక ఉపాసన సైతం ఇంట్లో ఉంటూ.. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన కొన్ని అందమైన ఫోటోలను ఇన్ స్టాలో పంచుకున్నారు. తన ప్రెగ్నెన్సీ ట్రైమిస్టర్ సంబంధించిన పిక్స్ షేర్ చేశారు. సెలబ్రెటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన సారీలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. “నా ఫోన్ లో ఉన్న ఇంత మంచి ఫోటోలను ఇంతకు ముందు ఎందుకు పోస్ట్ చేయలేదా ?.. ఆశ్చర్యంగా ఉంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.




అయితే ఈ పోస్ట్ కు మహేశ్ బాబు సతీమణి నమ్రత స్పందిస్తూ.. ‘నేను అదే చెప్పాలనుకుంటున్నాను’ అంటూ రిప్లై ఇవ్వగా.. హర్ట్ సింబల్స్ షేర్ చేసింది ఉపాసన . వీరిద్దరి చాట్ చూసి అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
