AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్ సరికొత్త సక్సెస్ ఫార్ములా.. ఆ సినిమాలపై మనసుపడిన చెర్రీ..

గతేడాది రాజమౌళి నుంచి వచ్చిన RRR 1920స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామా. ఇక శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తున్న గేమ్ ఛేంజర్ కూడా పీరియాడిక్ ఛాయలుంటాయి. ఇందులో కూడా స్వాతంత్య్రానికి పూర్వం కథతో పాటు ప్రజెంట్ స్టోరీ ఉంటుంది.. అది పూర్తిగా పొలిటికల్ ఎంటర్‌టైనర్.

Ram Charan: రామ్ చరణ్ సరికొత్త సక్సెస్ ఫార్ములా.. ఆ సినిమాలపై మనసుపడిన చెర్రీ..
Ram Charan
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jul 22, 2023 | 1:36 PM

Share

రామ్ చరణ్ సరికొత్త సక్సెస్ ఫార్ములా కనుక్కొన్నారా..? కాలంతో వెనక్కి వెళ్తే తప్ప.. కెరీర్‌లో ముందుకు వెళ్లలేం అని ఫిక్సైపోయారా..? ఏదో ఒక్కటంటే ఓకే అనుకోవచ్చు.. వరసగా పీరియాడికల్ సినిమాల వైపు రామ్ చరణ్ వెళ్లడానికి.. అలాంటి కథలను ఎంపిక చేసుకోడానికి కారణమేంటి..? ప్రజెంట్ కంటే పాస్ట్ స్టోరీస్‌కు డిమాండ్ ఎక్కువనే థీమ్ ఫాలో అవుతున్నారా..? అసలేంటి చరణ్ ప్లానింగ్..?. చూస్తుంటే రామ్ చరణ్‌కు పీరియాడికల్ సినిమాలపై ఇష్టం బాగా పెరిగిపోయిందేమో అనిపిస్తుంది. గతేడాది రాజమౌళి నుంచి వచ్చిన RRR 1920స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామా. ఇక శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తున్న గేమ్ ఛేంజర్ కూడా పీరియాడిక్ ఛాయలుంటాయి. ఇందులో కూడా స్వాతంత్య్రానికి పూర్వం కథతో పాటు ప్రజెంట్ స్టోరీ ఉంటుంది.. అది పూర్తిగా పొలిటికల్ ఎంటర్‌టైనర్.

శంకర్ సినిమా సెట్స్‌పై ఉండగానే.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేసారు చరణ్. ఇది కూడా బ్రిటిష్ కాలం నాటి స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమా కోసం సముద్రతీరపు సెట్ వేయనున్నారు. వైజాగ్, గోదావరి జిల్లాల్లోని తీర ప్రాంతంలో జరిగే పీరియాడిక్ కథ ఇది అంటున్నారు. బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనలోనూ సముద్రం, తీర ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చరణ్‌కూ ఇదే సెంటిమెంట్ అప్లై చేస్తున్నారు బుచ్చిబాబు.

ఇవి కూడా చదవండి

రామ్ చరణ్ ఎక్కువగా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాల వైపు వెళ్లడానికి ఎమోషన్స్ బలంగా ఉండటం.. పాన్ ఇండియన్ అప్పీల్ ఉండటం.. అన్నింటికంటే ముఖ్యంగా విజువల్ ట్రీట్ ఉండటం కారణాలయ్యుండొచ్చు. బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతుంది. డిసెంబర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ గ్యాప్ లో గేమ్ ఛేంజర్ షూట్ పూర్తి చేయబోతున్నారు చరణ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.