S. S. Rajamouli: రాజమౌళి తీసిన సినిమాల్లో ఆయన భార్యకు ఆ సినిమా అస్సలు నచ్చలేదట.. కేవలం హీరో వల్లే ఆడిందంటూ..
బాహుబలి సినిమాతో తానేంటో దేశానికి తెలిసేలా చేసిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు.

దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తోంది. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ నలుమూలల విస్తరించేలా చేశారు రాజమౌళి. బాహుబలి సినిమాతో తానేంటో దేశానికి తెలిసేలా చేసిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు. రాజమౌళి చేసిన సినిమాలు 13 సూపర్ హిట్స్.. అపజయం అంటూ ఎరుగక దూసుకుపోతున్నారు. ఆయన చేసిన సినిమాలన్నింటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు చేశారు. తారక్ తో జక్కన్న నాలుగు సినిమాలు చేశారు. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలనీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఆయన సతీమణికి మాత్రం రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఒక సినిమా అస్సలు నచ్చదట.
రాజమౌళి సతీమణి రామ రాజమౌళి కూడా ఆయన సినిమాల్లో భాగం అవుతూ ఉంటారు. ఆ మధ్య రామ రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాల్లో యమదొంగ సినిమా ఆమెకు నచ్చలేదని అన్నారు.
యమదొంగ సినిమా డైరెక్షన్ నాకు అంతగా నచ్చలేదు. ఎందుకో తెలియదు కానీ ఆ సినిమాను పెద్దగా నచ్చలేదు అని అన్నారు. అలాగే తారక్ మాత్రం అద్భుతంగా నటించాడు. అసలు తారక్ వల్లే ఆ సినిమా నిలబడిందని అనిపిస్తుంది. అని రామ రాజమౌళి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.







