Manchu Manoj: ‘త్వరలోనే నా జీవితంలో మరో మజిలీ.. చాలా రోజుల నుంచి ఈ వార్తను మనసులో ఉంచుకున్నా’.. మనోజ్‌ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌..

సినీ పరిశ్రమలోనే కాదు.. ఇటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ గా ఉంటున్నారు మనోజ్. ఇప్పుడు ఆకస్మాత్తుగా ఆయన చేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అంతేకాదు..మనోజ్ చేసిన ట్వీట్ పై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

Manchu Manoj: 'త్వరలోనే నా జీవితంలో మరో మజిలీ.. చాలా రోజుల నుంచి ఈ వార్తను మనసులో ఉంచుకున్నా'.. మనోజ్‌ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌..
Manchu Manoj
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 18, 2023 | 1:02 PM

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యారు హీరో మంచు మనోజ్. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన మనోజ్.. ఆ తర్వాత వచ్చిన బిందాస్ చిత్రానికి నంది అవార్డ్ అందుకున్నారు. తర్వాత వేదం, ఝుమ్మంది నాదం, కరెంట్ తీగ, రాజు భాయ్ వంటి చిత్రాలతో మెప్పించారు. అయితే గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు మనోజ్. ఇప్పటివరకు ఆయన నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు. సినీ పరిశ్రమలోనే కాదు.. ఇటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ గా ఉంటున్నారు మనోజ్. ఇప్పుడు ఆకస్మాత్తుగా ఆయన చేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అంతేకాదు..మనోజ్ చేసిన ట్వీట్ పై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

“ఈ విషయం చాలా రోజులుగా నా మనసులోనే దాచుకున్నాను.. నా జీవితంలోని మరో దశలోకి ప్రవేశించడానికి సంతోషిస్తున్నాను.. అదేంటో 20 జనవరి 2023న ప్రకటిస్తాను.. నాకు ఎప్పటిలాగే మీ అందరి ఆశీస్సులు కావాలి”.. అంటూ ట్వీట్ చేశారు మనోజ్. దీంతో మనోజ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి చెప్పుతున్నారా ?.. లేదా సెకండ్ మ్యారెజ్ అనౌన్స్ చేయబోతున్నారా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అసలు విషయం ఏంటీ అనేది తెలియాలి అంటే జనవరి 20 వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ సినిమాల విషయాన్ని పక్కన పెడితే కొద్దిరోజులుగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న మనోజ్.. ఆ తర్వాత 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మనోజ్ ఒంటరిగానే ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా మనోజ్ రెండో పెళ్లి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనికతో కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై సున్నితంగా స్పందించారు. దీంతో వీరి పెళ్లి నిజమనే టాక్ నడిచింది. ఈ క్రమంలో ఇప్పుడు మనోజ్ చేసిన ట్వీట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.