AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Posani Krishna Murali : పోసాని కృష్ణమురళీకి అస్వస్థత అంతా నాటకమే.. పోలీసుల రియాక్షన్ ఇదే..

తెల్లవారుజామున 5:30 గంటలకు మేజిస్ట్రేట్ పోసాని కృష్ణ మురళిని రిమాండ్కు తరలించవలసిందిగా తీర్పు ఇచ్చారు.. దీంతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తీసుకొని వచ్చారు.. అప్పటినుంచి పోసానికి మోషన్స్ అవుతున్నాయని ఆయనను ములాకత్తులో కలిసిన తన స్నేహితులు మీడియా ముందు తెలిపారు..

Posani Krishna Murali : పోసాని కృష్ణమురళీకి అస్వస్థత అంతా నాటకమే.. పోలీసుల రియాక్షన్ ఇదే..
Posani Krishna Murali
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Mar 01, 2025 | 9:21 PM

Share

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. పలు కేసులలో అరెస్టై అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణ మురళి ఈరోజు అస్వస్థతకు గురవడంతో సబ్ జైలు పోలీసులు అతని మొదటగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు.. అయితే మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కడప రిమ్స్ ఆసుపత్రికి పోసానిని తీసుకువచ్చారు… అక్కడ కూడా పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రైల్వేకోడూరు రూరల్ సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోసానికి అన్ని పరీక్షలు నిర్వహించారని ఈరోజు ఉదయం నుంచి పోసాని కావాలనే డ్రామా ఆడుతున్నారని రైల్వేకోడూరు రూరల్ సీఐ అన్నారు.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని జనసేన నేత జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు గత బుధవారం హైదరాబాదులోని తన నివాసంలో అదుపులోకి తీసుకొని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చారు… అక్కడ పోసాని కృష్ణ మురళిని విచారించిన పోలీసులు తనపై పెట్టిన అభియోగాలన్నిటిపై వివరణ తీసుకున్నారు… అనంతరం రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అతనిని ప్రవేశపెట్టారు.. దాదాపు ఏడు గంటలు వాదనలు విన్న తర్వాత గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకు మేజిస్ట్రేట్ పోసాని కృష్ణ మురళిని రిమాండ్కు తరలించవలసిందిగా తీర్పు ఇచ్చారు.. దీంతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తీసుకొని వచ్చారు.. అప్పటినుంచి పోసానికి మోషన్స్ అవుతున్నాయని ఆయనను ములాకత్తులో కలిసిన తన స్నేహితులు మీడియా ముందు తెలిపారు.. పోసానికి అస్వస్థతగా ఉందని నిన్నటి నుంచి ఆయనను కలిసిన వారంతా చెబుతూనే ఉన్నారు. అయితే ఈరోజు కూడా రాజంపేట స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి కూడా ఆయనను కలిసి వచ్చిన తర్వాత ఆయనకు అనారోగ్యంగా ఉందని చెప్పిన కొంత సమయానికి ఆయన రాజంపేట సబ్ జైలు సిబ్బందితో తన ఆరోగ్యం బాలేదని తనను ఆసుపత్రికి తీసుకొని వెళ్లాలని కోరడంతో వారు రాజంపేట ప్రభుత్వాసుపత్రికి ఆయనను తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు… అంతా బాగానే ఉందని తెలిపారు.

దీంతో పోసాని మరికొన్ని టెస్ట్లు చేయించాలని కోరగా రాజంపేట ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆయనను కడప రిమ్స్ కు తీసుకువెళ్లి అక్కడ టెస్టులు చేయించవలసిందిగా రిఫర్ చేశారు .. దీంతో పోసానిని కడప రిమ్స్ కు తీసుకోవచ్చి రక్త పరీక్షలు, గుండెకు సంబంధించిన పరీక్షలు, అలాగే ట్రాన్సల్స్ కు సంబంధించిన పరీక్షలు, స్కానింగ్లు అన్ని చేశారు… అయితే ఇదే విషయంపై పోసానిని ఆసుపత్రికి తీసుకువచ్చిన రైల్వేకోడూరు రూరల్ సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోసానికి రాజంపేటలో అలాగే కడప రిమ్స్ లో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారని ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందని కావాలనే ఆయన ఉదయం నుంచి డ్రామా ఆడుతున్నారని అన్నారు.. ఆయనను తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తామని చేశారు. అలాగే కడప రిమ్స్ వైద్యులు కూడా మాట్లాడుతూ పోసానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు చేసి పంపిస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?