Daali Dhananjaya: పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి.. సొంత ఖర్చులతో స్వగ్రామంలో…
ప్రముఖ కన్నడ నటుడు, పుష్ప ఫేమ్ డాలీ ధనంజయ్ వచ్చే నెలలో పెళ్లిపీటలెక్కనున్నాడు. కర్ణాటకలోని మైసూర్ వేదికగా డాక్టర్ ధన్యతో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. అయితే పెళ్లికి ముందు డాలీ ధనంజయ్ ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకున్నాడు.
అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమాలో జాలి రెడ్డిగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు డాలీ ధనంజయ్. ఈ మధ్యనే సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమాలోనూ ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే డాలీ ధనుంజయ్ మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్నాడు. ధన్యత అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ నెలలోనే మైసూరు వేదికగా వీరి వివాహం జరగనుంది. డాలీ ధనంజయ్ మంచి నటుడు, నిర్మాత గానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ఈ క్రమంలోనే తన పెళ్లికి ముందు ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. ధనంజయ్ సొంతూరైన హత్తూరులోని ప్రభుత్వ పాఠశాలను తన సొంత ఖర్చుతో బాగు చేయిస్తున్నాడు. ఈ పాఠశాలలో గోడలు పగుళ్లు, పైకప్పు లీకేజీలు, ఫ్లోర్ మ్యాట్ అరిగిపోయాయి. పాఠశాలలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు డాలీ ధనంజయ్ తన సొంత డబ్బుతో ప్రభుత్వ పాఠశాలను బాగు చేయిస్తున్నాడు.
హుత్తురులో ఉన్నఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బాగా శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని గమనించిన డాలీ ధనంజయ్ స్కూల్ మొత్తానికి కొత్త రూపు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. పాఠశాలకు గోడలు, టెర్రస్‌ను బాగు చేయిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ఫ్లోర్ కవరింగ్ తొలగించి కొత్త టైల్స్ వేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయుల గదులను మరమ్మతులు చేయిస్తున్నాడు. గేట్ రిపేర్, కాంపౌండ్ రిపేర్, స్కూల్ మొత్తానికి పెయింటింగ్ వేయడం, మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛమైన తాగునీటి కోసం కొత్త వాటర్ ఫిల్టర్, అన్ని వసతులతో కూడిన వంటగది తదితర పనులను డాలీ ధనంజయ్ తన సొంత ఖర్చులతో చేయిస్తున్నాడు.
కాబోయే భార్యతో డాలీ ధనుంజయ..
View this post on Instagram
ఈ సందర్భంగా డాలీ ధనంజయ్ స్వయంగా సందర్శించి పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్‌డిఎంసీ సభ్యులతో మాట్లాడాడు. పాఠశాలకు అవసరమైన సహాయం చేయిస్తున్నాడు. ఇప్పటికే మరమ్మతులు ప్రారంభమయ్యాయి. కొన్ని వారాల్లో పాఠశాల కొత్త రూపాన్ని సంతరించుకోనుంది. డాలీ ధనంజయ్ చేస్తోన్న ఈ మంచి పని పలువురి ప్రశంసలు అందుకుంటోంది. కాగా డాక్టర్ బాబు జగ్జీవన రామ్ లెదర్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అంబాసిడర్ డాలీ ధనంజయ్.. హస్తకళా కార్మికులకు తనవంతు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మైసూరులో వివాహ వేడుక..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..