Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్‌తో రిలేషన్‌షిప్ రూమర్స్.. యంగ్ హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే?
Pujita Ponnada: అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి చిత్రంతో వెండితెరకు పరిచయమైంది పూజిత పొన్నాడ. విశాఖపట్నంకు చెందిన ఈ అమ్మాయి తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది.

Pujita Ponnada: అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి చిత్రంతో వెండితెరకు పరిచయమైంది పూజిత పొన్నాడ. విశాఖపట్నంకు చెందిన ఈ అమ్మాయి తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ఆతర్వాత దర్శకుడు, రంగస్థలం, రాజుగాడు, బ్రాండ్‌బాబు, హ్యాపీ వెడ్డింగ్, సెవెన్, కల్కి, మిస్ ఇండియా, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్ తదితర సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. త్వరలోనే ఆకాశవీధుల్లో చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న పూజిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా రాకింగ్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) తో రిలేషన్‌షిప్‌లో ఉందంటూ వస్తోన్న వదంతులపై నోరు విప్పింది.
‘దేవిశ్రీతో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తవం. అసలు ఆ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో నాకు అర్థం కావడం లేదు. మేమిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నామని అంటున్నారు. ఇందులో ఏ మాత్రం నిజం కాదు. ఆయనతోనే కాదు నేను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేను. ప్రస్తుతానికి నేను సింగిల్. సామాజిక మాధ్యమాల్లో కొన్నిసార్లు నాపై నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి. వాటిని చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది పూజిత. కాగా ఆకాశ వీధుల్లో సినిమాతో పాటు రవితేజ రావణాసుర, పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార.




View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




