Bigg Boss Season 6: మరికొద్ది గంటల్లోనే బిగ్‏బాస్ షో ప్రారంభం.. చివరి క్షణంలో భారీ మార్పులు..

ఇక ఈసాయంత్రం మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి ప్రవేశించనున్నట్లుగా తెలుస్తోంది. అందులో 9 మంది

Bigg Boss Season 6: మరికొద్ది గంటల్లోనే బిగ్‏బాస్ షో ప్రారంభం.. చివరి క్షణంలో భారీ మార్పులు..
Bigg Boss
Follow us

|

Updated on: Sep 04, 2022 | 1:08 PM

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాల్టీ షో మరికొద్ది గంటల్లో బిగ్‏బాస్ (Bigg Boss Season 6) ప్రారంభం కాబోతుంది. ఈరోజు సాయంంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానల్‏తోపాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా బిగ్‏బాస్ సీజన్ 6కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే షోకు సంబంధించి విడుదలైన ప్రోమోస్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ఈసాయంత్రం మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి ప్రవేశించనున్నట్లుగా తెలుస్తోంది. అందులో 9 మంది అబ్బాయిలు ఉండగా.. 10 మంది అమ్మాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. సీరియల్స్, సినిమాలు, రియాల్టీ షోలలో ఫేమస్ అయినవారు ఈసారి బిగ్‏బాస్ ఇంట్లో సందడి చేయనున్నారు. ఇప్పటికే వారంతా క్వారంటైన్‏లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందామా.

జబర్ధస్థ్ ఫైమా.. చలాకీ చంటి, సుదీప (నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ), అభినయ శ్రీ, యాంకర్ ఆరోహి, కీర్తి భట్, వాసంతి కృష్ణన్, యాంకర్ నేహా చౌదరీ, గలాటా గీతు, ఆర్జే సూర్య, సింగర్ రేవంత్, రోహిత్ మెరీనా(కపూల్స్), హీరో అర్జున్ కళ్యాణ్, బాలాదిత్య, మోడల్ రాజశేఖర్, సింగర రేవంత్, శ్రీహాన్, యూట్యూబర్ ఆదిరెడ్డి, ఇనయ సుల్తానా, నటి శ్రీ సత్య ఉన్నారు. ఇక గత సీజన్లకు భిన్నంగా 6వ సీజన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈసారి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ఉండనుంది. ఇక గత సీజన్ మాదిరిగానే ఇప్పుడు కూడా హౌస్ లోకి రియల్ కపుల్ ఎంటర్ కాబోతున్నారు. కానీ వారిలో ఒక్కరు నామినేషన్‏లో ఉన్నా.. ఇద్దరు ఉన్నట్టే అని.. ఒక్కరు ఎలిమినేట్ అయితే ఇద్దరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈసారి బిగ్‏బాస్ సీజన్ 6 పూర్తిగా సరికొత్త నియమ నిబంధనలతో ఉండనుందని సమాచారం. ఇక తాజాగా విడుదలైన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. స్టార్ మా ఛానల్లో శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుండగా. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.