Kethika Sharma: రొమాంటిక్ బ్యూటీలో మరో స్పెషల్ టాలెంట్.. ఏకంగా దేవీ శ్రీ ప్రసాద్ ఫిదా అయ్యాడు..

ఇటీవలే ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేసిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను అద్భుతంగా ఆలపించింది. కేతిక పాడుతున్న వీడియో నెటింట వైరల్

Kethika Sharma: రొమాంటిక్ బ్యూటీలో మరో స్పెషల్ టాలెంట్.. ఏకంగా దేవీ శ్రీ ప్రసాద్ ఫిదా అయ్యాడు..
Devi Sree
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 04, 2022 | 9:13 AM

రొమాంటిక్ సినిమాతో వెండితెరకు హీరోయిన్‏గా పరిచయమైంది కేతిక శర్మ (Kethika Sharma). మొదటి సినిమాతోనే గ్లామర్ డోస్‏తో ఆకట్టుకుంది ఈ న్యూఢిల్లీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత లక్ష్య సినిమాలో నటించిన కేతిక.. ఇప్పుడు రంగ రంగ వైభవంగా మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 2న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించగా.. డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కేతిక తనలోని మరో టాలెంట్‏ను బయటపెట్టింది. ఇటీవలే ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేసిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను అద్భుతంగా ఆలపించింది. కేతిక పాడుతున్న వీడియో నెటింట వైరల్ అయ్యింది. ఇక అది కాస్త మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ వద్దకు చేరింది.

హీరోయిన్ కేతిక పాడిన విధానానికి ఫిదా అయ్యారు దేవీ శ్రీ ప్రసాద్. వావ్. ఇది ఆశ్చర్యం. కేతిక ఎక్స్‏ప్రెస్సీవ్‏గా పాడిందంటూ ట్వీట్ చేశారు దేవీ శ్రీ. డెరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ మూవీలోని అన్ని పాటలను యూట్యూబ్ ను షేక్ చేశాయి. ప్రస్తుతం దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప సెకండ్ పార్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ అయ్యాయని.. మూడు పాటలు కూడా కంపోజ్ చేశానని తెలిపారు. సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ అదిరిపోయిందంటూ దేవీ శ్రీ చెప్పడంతో పుష్ప ది రూల్ పై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూట్ ప్రారంభం కానుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.