Mahalakshmi Ravinder : కొత్తజంటపై నెగిటివ్ కామెంట్స్.. బాడీషేమింగ్ చేస్తూ ట్వీట్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన నటి..
రవీందర్ చంద్రశేఖరన్ భారీ కాయం ఉండడం.. మహాలక్ష్మీ సన్నజాజి తీగల ఉండడమే కారణం. దీంతో వీరిపై నెగిటివ్ కామెంట్స్ చేశారు నెటిజన్స్.
ప్రముఖ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్.. సీరియల్ నటి మహాలక్ష్మీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే (Mahalakshmi Ravinder). సెప్టెంబర్ 1న తిరుపతిలో ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరికి ఇదివరకు పెళ్లిళ్లు అయ్యా విడిపోయారు కూడా. గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే వీరి పెళ్లి పోటోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఇందులో రవీందర్ చంద్రశేఖరన్ భారీ కాయం ఉండడం.. మహాలక్ష్మీ సన్నజాజి తీగల ఉండడమే కారణం. దీంతో వీరిపై నెగిటివ్ కామెంట్స్ చేశారు నెటిజన్స్. ముఖ్యంగా బాడీ షేమింగ్ చేసినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిపై వస్తున్న వార్తలు.. ట్రోల్స్ పట్ల స్పందించారు మహాలక్ష్మీ రవీందర్.
తమ ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొదట రవీందర్ తనకి ప్రపోజ్ చేశాడని.. నువ్వు నా భార్యవి కాగలవా ? అంటూ మెసేజ్ పెట్టారని.. ఆ తర్వాత కొద్దిగా టైమ్ తీసుకుని ఓకే చెప్పానని తెలిపింది మహాలక్ష్మీ. తమ పెళ్లి ఇంత వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదని.. చాలా మంది తమకు ఫోన్స్ చేసి విష్ చేస్తున్నారని.. మరికొందరు సోషల్ మీడియాలో తమను ట్రోల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారన్నారు రవీందర్. ఎదుటివారి లైఫ్ అనేసరికి సులువుగా మాటలు అనేస్తారని.. వాటికి తాను పెద్దగా కుమిలిపోనని చెప్పాడు. అలాగే తన భర్తతో తాను హ్యాపీగా ఉన్నానని.. బాడీ షేమింగ్ గురించి తాను పట్టించుకోనని.. కేవలం మనసు మాత్రమే ముఖ్యమని.. తనతో ఎలా ఉన్నారన్నది ముఖ్యమని.. నెట్టింట వచ్చే కామెంట్స్ పట్టించుకోనని తెలిపారు మహాలక్ష్మీ. బాడీ షేమింగ్ చేసినవాళ్లు అనుభవిస్తారని.. వాటి గురించి పెద్దగా పట్టించుకోమని.. కలిసింది తమ మనసులని.. రూపాలతో తమకి పనిలేదని అంటున్నారు ఈ కొత్తజంట. కాగా.. వాణి రాణి, ఆఫీస్, చెల్లమాయ్, ఉతిరిపూక్కల్ సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు మహాలక్ష్మీ. అలాగే తన భర్త నిర్మిస్తోన్న రెండు చిత్రాల్లోనూ ఆమె నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.